18 సంవత్సరం లు పూర్తి చేసుకున్న వారందరూ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాలి…

ప్రచురణార్ధం

18 సంవత్సరం లు పూర్తి చేసుకున్న వారందరూ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాలి…

మహబూబాబాద్, సెప్టెంబర్,15.
18 సంవత్సరం లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక విజ్ఞప్తి చేశారు.

బుధవారం కలెక్టర్ నూరుశాతం వ్యాక్సినేషన్ పొందిన జిల్లాగా గుర్తించేందుకు అర్హులైన వారంతా వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలన్నారు.

కోవిద్ 19 వ్యాక్సినేషన్ లో భాగంగా జిల్లాలో 5 లక్షల 43 వేల మంది అర్హులైన వారిని గుర్తించగా రెండు లక్షల 40 వేల మందికి మొదటి డోస్ ఇవ్వడం జరిగిందని మరో మూడు లక్షల మందికి ఇవ్వాల్సి ఉందని 44 శాతంగా నమోదయింది అన్నారు.

జిల్లాలోని 21 ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాలతో పాటు 173సబ్ సెంటర్ లు, లలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకునే వారికి కుర్చీలు త్రాగునీరు మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు.

వ్యాక్సిన్ వేసేందుకు ప్రతి సబ్ సెంటర్ వారీగా మైక్రో ప్లాన్ రూపొందిస్తున్నామని జాయింట్ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు గ్రామాలలో ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు సహకరిస్తారని ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించాలని ఆదేశించామన్నారు.

వైద్యులు వ్యాక్సినేషన్ పూర్తయ్యేంతవరకు నిరంతరం అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ఆర్ బి ఎస్ కె 108 వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు

ప్రతి సబ్ సెంటర్ పూర్ 100 నుండి 150 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని అలాగే పీహెచ్సీ కేంద్రాలకు 200 నుండి 300 మందికి వ్యాక్సిన్లు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టామన్నారు.

జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తెలుసుకునేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామని ఈ కేంద్రం 24 గంటలు నిరంతరం పని చేస్తుందన్నారు.
————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post