18 సంవత్సరాలు ఏ ఒక్కరి పేరు మిస్ కాకుండా, లేని వారి పేరు ఉండకుండా 100% కరక్ట్ ఓటరుగా జాబితా సిద్ధం చెయ్యాలని ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ అహ్మద్ నదీం అన్నారు.

* ప్రచురణార్థం * జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 17 (బుధవారం).

18 సంవత్సరాలు ఏ ఒక్కరి పేరు మిస్ కాకుండా, లేని వారి పేరు ఉండకుండా 100% కరక్ట్ ఓటరుగా జాబితా సిద్ధం చెయ్యాలని ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ అహ్మద్ నదీం అన్నారు. బుధవారం ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ అహ్మద్ నదీo జిల్లాలో పర్యటించి జెన్కో గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ మరియు భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని తాసిల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల బూత్ లెవెల్ అధికారులతో సమావేశం నిర్వహించి ఓటర్ నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ అని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించేది ఓటు అని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.2021-2022 ఓటరు జాబితాను సిద్ధం చేయడానికి ఓటరు నమోదుకు మరియు మార్పులు, చేర్పులకు ఎన్నికల సంఘం సూచించిన షెడ్యూల్ ప్రకారం అన్నీ పక్కాగా నిర్వహించాలని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి ఓటరు నమోదు 100% కరక్ట్ గా జరిగేలా భాగస్వాములు కావాలని అన్నారు కళాశాలలో తదితర ప్రాంతాలలో నూతన ఓటర్ నమోదుపై అవగాహన కల్పించి నేరుగా గాని ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో గాని ఓటరు నమోదు చేసుకునేలా నూతన ఓటర్లను చైతన్య పరచాలని అన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు గరుడ యాప్ ను ఉపయోగించి ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. ఓటర్ నమోదుకు స్పెషల్ కంపెయిన్ డేలను సద్వినియోగం చేయాలని అన్నారు. ఓటర్ జాబితా నుండి ఓటర్ పేరును తొలగిస్తే ముందస్తుగా సంబంధిత ఓటర్ కుటుంబానికి నోటీస్ అందజేసి సంబంధిత ఓటరు లేరని నిర్ధారణ అయితేనే తొలగించాలని అన్నారు. ఎపిక్ కార్డులను ఓటర్లకు అందించాలని, ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఆర్వోలు, ఏఆర్వోలు, బూత్ లెవల్ అధికారులు పొలిటికల్ పార్టీల సహకారంతో 5 జనవరి 2022 నాడు చివరి ఓటర్ జాబితాను విడుదల చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఓటర్ నమోదు ప్రక్రియ బూత్ స్థాయి నుండి నిర్వహిస్తున్నామని జిల్లాలో 264694 మంది ఓటర్లుగా నమోదయ్యారని వారిలో 132934 మంది పురుషులు, 131755 మంది స్త్రీలు మరియు 5 థర్డ్ జెండర్ వాళ్ళు ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా 317 పోలింగ్ కేంద్రాలకు 317 మంది బూత్ లెవెల్ పోలింగ్ అధికారులను నియమించామని వాటిలో 48 భూపాలపల్లి పట్టణంలో అర్బన్ పోలింగ్ స్టేషన్లు కాగా మిగతా 269 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తుది ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు నూతన ఓటర్ల నమోదు, చనిపోవడం లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడం తదితర మార్పులు, చేర్పులను పగడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్. దివాకర, ఆర్డీఓ శ్రీనివాస్, భూపాలపల్లి ఘన్పూర్, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, శాయంపేట తాసిల్దార్లు ఇక్బాల్, సతీష్ కుమార్, జీవాకర్ రెడ్డి, రామారావు, రవీందర్, మల్లయ్య, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post