18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి:

ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యం.వీర బ్రహ్మయ్య
0000

1, జనవరి 2022 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను అందరిని ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేయాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యం. వీర బ్రహ్మయ్య అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమం సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తేది.01-01-2022  వరకు     18సంవత్సరాలు నిండిన వారందరిని ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేసి  తుది ఓటర్ల జాబితాను05-01-2022 న  ప్రదర్శించాలని  ఆయన తెలిపారు. అందులో భాగంగా ఈ నవంబర్ నెలలో తేది.06-11-2021, 07-11-2021, 27-11-2021, 28-11-2021 శని, ఆదివారాల లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం బూత్ లెవల్ అధికారులు (బి.ఎల్.ఓ)ల ఆధ్వర్యంలో నిర్వహించాలని అన్నారు. ఈ నాలుగు రోజుల ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో పోలింగ్ స్టేషన్ ల పరిధిలో 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా   నమోదు చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుండి  వారి పేర్లను తొలగించాలని సూచించారు. అలాగే డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని అన్నారు. శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరిచేసుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో జిల్లాలోని 1339 పోలింగ్ స్టేషన్లలో 1339 బి.ఎల్.ఓలు   4రోజులు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ  ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్టోరల్ డ్రాఫ్టు పబ్లికేషన్ 01-11-2021 నాడు ప్రదర్శించామని తెలిపారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 06-11-2021 నాడు ఎలక్టోరల్ డ్రాఫ్టు పబ్లికేషన్ ప్రదర్శిస్తారని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో 3,38,900 మంది ఓటర్లు, చొప్పదండి నియోజకవర్గంలో 2,23,366 మంది ఓటర్లు, మానకొండూర్ నియోజకవర్గంలో 2,13,185 మంది ఓటర్ల డ్రాఫ్టు పబ్లికేషన్ ప్రదర్శించినట్లు తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో 390 పోలింగ్ స్టేషన్ లు, చొప్పదండి నియోజకవర్గంలో 327 పోలింగ్ స్టేషన్లు, మానకొండూర్ నియోజకవర్గంలో 316 పోలింగ్ స్టేషన్లు, హుజురాబాద్ నియోజకవర్గంలో 306 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒక బి.ఎల్.ఓ ను నియమించామని తెలిపారు. ఈ నెల 06, 07, 27,28 తేదీలలో అన్ని పోలింగ్ స్టేషన్లలో బి.ఎల్.ఓ.ల ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అందరు బి.ఎల్.ఓలకు ఓటర్ల నమోదుకు సంబంధించి ఫారం-6, ఫారం-7, ఫారం-8, ఫారం-8 A మొదలగు అన్ని రకాల ఫారంలు వారికి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అన్ని పోలింగ్ స్టేషన్లకు బూత్  లెవల్ ఏజెంట్లను నియమించి గ్రామాలలో, పట్టణాలలో 1, జనవరి 2022 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని, చనిపోయిన వారందరిని ఓటర్ల జాబితా నుండి తొలగించుటకు సహకరించాలని కోరారు. జిల్లాలోని 1339 పోలింగ్ స్టేషన్ల బూత్ లెవల్ అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లతో వివరాలు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇచ్చామని తెలిపారు. ఓటర్ల సవరణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత క్లెయిమ్స్ , ఆబ్జెక్షన్లను పరిశీలించి పరిష్కరించి తేది.05-01-2022 నాడు తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు.

Share This Post