18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ డి హరిచందన

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

ప్రపంచ దేశాలలో విపరీతంగా ప్రభావితం చేస్తున్న కొత్త వైరస్ ఓమిక్రాన్ వైరస్ కోవిడ్ తరువాత అత్యంత ప్రమాదకర వైరస్ అని శాస్త్రవేత్తలు అంటున్న సమయం లో  జిల్లా లో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వైక్సినేషన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డి హరిచందన జిల్లా ప్రజలకు పిలిపునించారు. గురువారం జిల్లా కేంద్రం 2,11 వార్డు లలో జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య అధికారులతో కలిసి ఇంటింటి తిరిగి వైక్సినేషన్ ప్యాక్రియను పర్యవేక్షికించారు. జిల్లా లో విస్తృతంగా వైద్యాధికారులు ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తిరుగుతున్నారని ఎవరుకుడా ఎలాంటి వదంతులు నమ్మవద్దని ప్రతి ఒక్కరు వ్యాస్కినేషన్ వేయించుకోవాలిని తెలిపారు. జిల్లా కలెక్టర్ సిడిగాలిపర్యటన నిర్వహించి  మద్దూర్, ధన్వాడ పాత తండా లో జరుగుతున్న వ్యస్కినేషన్ ను పరిశీలించారు. ఏ మండలం గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీ లో  100 శాతం పూర్తి చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు ప్రజలలో తగిన అవగాహనా కల్పించి త్వరగా 100 శాతం పూర్తి అయేటట్లుచర్యలు చేపట్టాలన్నారు.వ్యక్స్కినేషన్ ప్రక్రియలో భాగంగా వ్యక్స్కిన్ వేయిన్చుకున్నవారికి జిల్లా కలెక్టర్ మరియు అధికారులు చేపట్లతో అభినందనలు తెలిపారు. మొదటి విడత వేసుకొని రెండవ దఫా షెడ్యుల్ ప్రకారం తప్పనిసరిగా వేసుకోవలన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, జిల్లా వైద్యాధికారి రాం మనోహర్, డాక్టర్ శైలజ, మండల ప్రత్యెక అధికారులు క్రిష్ణమ చారి, గోవిందరాజన్, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ లు, తహసిదర్లు, యంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post