18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకులందరు ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల…

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకులందరు ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు.

మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని అధికారులు, కార్యాలయ సిబ్బందితో ఓటురు ప్రతిజ్ఞ గావించారు. ఈ సందర్బంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ తమ చుట్టు ప్రక్కల ఉన్న 18 సంవత్సరాలు ఇండిన యువతి యువకులు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. యువత మొబైల్ యాప్, ఆన్-లైన్ ద్వారా ఓటరు సేవలు వినియోగించుకోవాలని సూచించారు. యాప్ ద్వారా ఓటరుగా నమోదుతో పాటు, ఎపిక్ కార్డులో చిరునామా మార్పు, సవరణలు చేసుకోవచ్చాన్నారు. ఓటర్లు ప్రజాస్వామ్యంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కులం ,మతం ,వర్గం జాతి విభేదాలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ప్రజలలో అవగాహన కొరకు ప్రతి సంవత్సరం ఈరోజున జాతీయ ఓటరు దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని గుర్తు చేసారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, స్వీప్ నోడల్ ఆఫీసర్ కోటాజీ, పరిపాలన అధికారిణి హరిత, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీధర్ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post