18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ
————————————-
పెద్దపల్లి నవంబర్ 28
————————————-
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1,2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన యువతీ యువకులు ఓటరుగా తమ పేరు నమోదు చేసుకునేందుకు సమీప బూత్ స్థాయి అధికారిని లేదా మండల తహసీల్దార్ (అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి) సంప్రదించాలని సూచించారు. ఆన్ లైన్ లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు www.nvsp.in అనే వెబ్ సైట్ వినియోగించుకోవాలని, మరిన్ని వివరాలకు ఓటరు రిజిస్ట్రేషన్ హెల్ప్ లైన్ నెంబర్ 1950 నెంబర్ సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
—————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్దపల్లి కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post