18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటురుగ తమ పేరు నమోదు చేసుకొని, ఓటు హక్కు వినియోగించుకోవాలి…. కలెక్టర్ నిఖిల

జిల్లాలో 17 సంవత్సరాలు నిండిన యువత ముందస్తుగా ఫామ్ – 6 ద్వారా ఓటరుగా తమ పేరును నమోదు చేసుకొని 18 సంవత్సరాలు నిండిన పిదప తమ ఓటు హక్కును వినియోగించుకొవచ్చని జిల్లా కలెక్టర్ నిఖిల తెలియజేశారు.

13 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం రోజు పాఠశాల విద్యార్థులతో భారీ ర్యాలీతో పాటు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఇప్పుడు ప్రతి ఏడాదికి నాలుగు సార్లు ఓటరుగా నమోదుకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోని, ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నట్లయితే మన నియోజకవర్గాన్ని, జిల్లాను, రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి పరచుకోగలుగుతామన్నారు . ఓటు హక్కు వినియోగం కోసం వికలాంగులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు వీల్ చైర్స్ అందజేయనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. ఎన్నికల సమయంలో 30 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని, ఈసారి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలన్నారు. ఓటరుగా నమోదుకు సమీపంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి బిఎల్ఓలను సంప్రదించి ఓటరు నమోదుకు ఫామ్ – 6 తో పాటు, ఫామ్ – 6బి ద్వారా ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ వారి సందేశాన్ని వీడియో ద్వారా ప్రదర్శించినారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రూపొందించిన పాటను వినిపించి, అందరితో ఓటర్ల ప్రతిజ్ఞ గావించారు. ఈ సందర్భంగా ప్రతి ఎన్నికలలో అత్యధిక సార్లు తన ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లాకు చెందిన 95 సంవత్సరాల సీనియర్ సిటిజన్ జి. భూమయ్యకు ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఉద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, స్వీప్ మోడల్ ఆఫీసర్ కోటాజి, డి ఆర్ డి ఓ కృష్ణన్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి హనుమంతరావు, వికారాబాద్ ఆర్ డి ఓ విజయ కుమారి, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శంకర్ నాయక్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు

Share This Post