పత్రిక ప్రకటన
తేది: 15-9-2021
నారాయణపేట జిల్లా.
———————————————–
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేవిధంగా అన్ని హాబీటేషన్లు, మున్సిపాలిటీ వార్డుల వారిగా రేపటి నుండి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం
పై అందరూ జిల్లా జడ్పి చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయగా రాష్ట్ర మంత్రి హన్మకొండ కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రేపటి నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వములై రాష్ట్రంలో వంద శాతం
వ్యాక్సినేషన్ సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరారు. ఆన్నీ మున్సిపాలిటీ లు, అన్ని గ్రామ పంచాయతీలు, హాబీటేషన్లలో సర్వే నుర్వహించి ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంతమంది ఉన్నారు,
వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎంత ఇంకా తీసుకోవాల్సిన వారు ఎంతమంది అనే సర్వే చేసి ఇంటికి స్టిక్కర్లు అతికించాలని సూచించారు. ఈ కార్యక్రమం విజవంతం చేయడానికి డిపిఓ లు, జడ్పి సీఈఓ లు,
మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు, ఎంపిఓ లు, సర్పంచులు, జడ్పిటిసి లు ప్రతి ఒక్కరూ భాగస్వములు కావాలని కోరారు. ఈ కార్యక్రమ నిర్వహణలో సర్పంచులు క్యాంప్ ఏర్పాటుకు కావలసిన అన్ని ఏర్పాట్లు,
టెంట్లు, కుర్చీలు, మంచినీరు, వచ్చిన సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయాలని తెలియజేసారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రేపటి నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సూక్ష్మ ప్రణాళికలు రూపొందించుకోవాలని
కలెక్టర్లను ఆదేశించారు. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ని ఉప కేంద్రాలు ఉన్నాయి వాటి కింద ఎన్ని హాబీటేషన్లు ఉన్నాయి,
ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అందులో ఎంత మంది వ్యాక్సిన్ తీసుకున్నారు తీసుకొని వారు ఎవరున్నారు అనే పూర్తి వివరాలు నిర్ణిత ప్రొఫార్మలో రూపొందించుకోవాలని సూచించారు.
ప్రతి హాబీటేషన్లలో అంగన్వాడీ, ఆశ వర్కర్ తో టీమ్ ఏర్పాటు చేసుకోని ప్రతి ఇంటికి తిరిగి స్టిక్కర్ అతికించాలన్నారు. ఆ ఉరికి వ్యాక్సిన్ బృందం ఎప్పుడు వస్తుందో ముందు రోజు డప్పు,
ఆటో ద్వారా టామ్ టామ్ చేయించాలని తెలియజేసారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించి వ్యాక్సిన్ ఇప్పించాలని తెలిపారు. ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు
కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం అభినందనీయమని ఈ సందర్బంగా అన్ని కలెక్టరేట్లలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకోవాల్సిందిగా తెలిపారు.
జిల్లా కలెక్టర్ డి హరిచందన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 18 సవత్సరాలు నిండిన వారికి 50 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని,
మిగిలిన వారిని గుర్తించి వ్యాక్సిన్ ఇప్పించేందుకు సూక్ష్మ ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యజరమాన్ని విజయవంతం చేసేందుకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు అందరిని భాగస్వాములను చేసి సమన్వయంతో పని చేసి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని తెలిపారు.
జిల్లా జెడ్పి చైర్పర్సన్ వనజమ్మ మాట్లాడుతూ ముఖ్గ్యమంత్రి అదేశానుసరంగా గ్రామపంచాయతి లలో ప్రతి వార్డు సమావేశాలు నిర్వహించి ఎవరైతే వ్యాక్సిన్ వేయించొకోలేదో వారికి వ్యాక్సిన్ వేయించే చర్యలుచేపడతమామి తెలిపారు
వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ రిజివి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ, జిల్లా నుండి అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, జిల్లా వైద్య అధికారి డాక్టర్ మనోహర్ రావు, సి యి ఓ సిద్రమప్ప, డి ఐ ఓ శైలజ, నారాయణపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
———————————
జిల్లా పౌర సంబంధాల అధికారి నారాయణపేట ద్వారా జారీ.