18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడికి కోవిడ్ వ్యాక్సిన్ అందజేసే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 15 (బుధవారం).

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడికి కోవిడ్ వ్యాక్సిన్ అందజేసే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

బుధవారం చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ హైదరాబాద్ నుండి సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కోవిడ్19
వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మాట్లాడుతూ కోవిడ్ నుండి ప్రజలను రక్షించడం కొరకు రాష్ట్రంలో రెండు కోట్లు కోవిడ్ వ్యాక్సిన్ అందించి ప్రజల ప్రాణాలను రక్షించడంలో వైద్య ఆరోగ్య శాఖ అహర్నిశలు పని చేసిందని వారికి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు.
కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం కొరకు అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాలని అన్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించాలని, ముందుగా ఆటోల ద్వారా ప్రచారం నిర్వహించాలని ఆ ప్రచారంలో వ్యాక్సినేషన్ కౌంటర్ల వివరాలు ఏ సమయంలో కౌంటర్ ప్రారంభించేది ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు, ప్రతి జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి వ్యాక్సిన్ అందించడం కొరకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని
వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది, సిబ్బంది కొరత లేదు పిహెచ్ సి, సబ్ సెంటర్ వైజ్ హ్యాబిటేషన్ వారిగా హౌస్ హోల్డ్ ను గుర్తించి ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలని తెలిపారు. ఆశా వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రతి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో వ్యాక్సినేషన్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని వ్యాక్సినేషన్ కార్యక్రమంపై క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రైతు వేదికలు , హాస్టల్ బిల్డింగ్స్ , సబ్ సెంటర్ నందు వ్యాక్సిన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని వ్యాక్సినేషన్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా వర్గాల వారికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి కోవిడ్ నిబంధనలతో వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని, వ్యాక్సిన్ సెంటర్లో అన్ని వసతులు కల్పించడంతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. టీంవర్క్ గా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండ జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా పని చేస్తున్నారని, రాష్ట్రంలో కోవిడ్ నుండి ప్రజలను రక్షించడం కొరకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచి ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. రెండు కోట్ల 18 లక్షల మంది 18 సంవత్సరాల వయసు దాటిన వారు ఉన్నారని గుర్తించడం జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా వీరందరికీ వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రోజుకు 3 లక్షల డోసులు ఇచ్చే విధంగా ప్రజా ప్రతినిధులను కోఆర్డినేషన్ చేసుకునివార్డుల వారీగా టార్గెట్ ఫిక్స్ చేయాలని తద్వారా వ్యాక్సినేషన్ విజయవంతం అవడానికి దోహదపడుతుందన్నారు.ఎక్కడైతే వ్యాక్సినేషన్ కార్యక్రమం 100% పూర్తి అవుతుందో అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పండుగ వాతావరణంగా కార్యక్రమం చేయాలన్నారు
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో ప్రజలకు అందుబాటులో ఎక్కువ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని భూపాలపల్లి టౌన్ లో 30వార్డులకు 15 వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని, 9 మండలాల కేంద్రాలలో ఎక్కువ పాపులేషన్ ఉన్న దగ్గర వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉదయం 6:00 నుండి వ్యాక్సిన్ కౌంటర్లు ప్రారంభించే విధంగా స్టాఫ్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూపాలపల్లి జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన యువత 58,000 ఉన్నారని వారందరికీ వ్యాక్సిన్ వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు వ్యాక్సినేషన్ కార్యక్రమం డేటా అప్లోడ్ చేయడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్ లను వ్యాక్సినేషన్ కౌంటర్ దగ్గర నియమిస్తామన్నారు. ప్రభుత్వ సలహాలను, సూచనలను పాటిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేసే విధంగా చూస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖఅధికారి డా. శ్రీరామ్, జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్. మమతదేవి, ప్రోగ్రాం అధికారి డాక్టర్.రవి తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్వో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post