18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వాక్సిన్ తీసుకోవాలి:మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు .

రాష్ట్రంలో మెగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా రాయపర్తిలో ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం, పెర్కవేడు గ్రామాలలో గురువారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభి0చారు.

ఈ సందర్బంగా మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.తద్వారా ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కెసిఆర్ తీసుకుంటున్న చర్యల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు .

కరోనా మహమ్మారి నుండి తెలంగాణ ప్రజలను కాపాడటానికి ప్రతిరోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో  కరోనా పూర్తి నియంత్రణ లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టిందన్నారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాల పైబడిన వారు 2 కోట్ల 80 లక్షల మంది ఉన్నారని.. ఇప్పటి వరకు రెండు కోట్ల 17 వేలమందికి వాక్సిన్ వేసుకున్నారన్నారు.

వీరిలో ఒక కోటి 45 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని…55 లక్షల మందికి సెకండ్ డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసిందన్నారు

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్పూర్తితో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా కలిసి కలిసికట్టుగా, సమన్వయంతో కరోనా వ్యాక్సినేషన్ ని విజయవంతం చేయాలన్నారు.

గ్రామాలు, వార్డుల వారీగా ప్రణాళిక బద్దంగా 100% వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని…తహసిల్దారు, ఎ0.పి.డి.ఓ, మెడికల్ ఆఫీసర్ మండల స్థాయి లో సమన్వయం చేసుకోవాలన్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియలో బాగా పనిచేసిన వారికి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అవార్డులు అందజేస్తామన్నారు.

అన్ని గ్రామాలు, పట్టణాలలో ఇంటింటికి ఆశా, అంగన్వాడీ, స్థానిక సంస్థల సిబ్బంది వెళ్లి రెడీ చేసిన వాక్సిన్ తీసుకోనివారి జాబితా సిద్ధంగా ఉందన్నారు.

గుర్తించిన వారికి వాక్సిన్ ఇచ్చి, ఆ ఇంటి కి వాక్సిన్ కు సంబంధి0చిన స్టిక్కర్ వేయాలని… ప్రతీ మున్సిపాలిటీకి, మండలానికి వాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలన్నారు.

గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ స‌భ్యులు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు స్వచ్చంద సంస్థలు భాగస్వామ‌లై నూటికి నూరు శాతం కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేసేందుకు గ్రామ స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గోపి మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రత్యేక కార్యక్రమానికి గ్రామాలలో 179 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరపనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

గ్రామాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి సిటిజన్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని… ఆశా వర్కర్లు అంగన్వాడీలు ప్రతి ఇంటిని తిరిగి అవగాహన పరిచి వ్యాక్సినేషన్ వేసుకునే విధంగా చూడాలని అనంతరం పూర్తిగా వ్యాక్సినేషన్ ఏసుకున్న వీళ్లకు స్పీకర్లు తగ్గించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

గ్రామాలలో లో లో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయటానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Share This Post