18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొనే విధంగా తగిన చర్యలను తీసుకోవాలనీ రాష్ట్ర ఎన్నికల సీఈఓ శశాంక్ గోయల్ ఆయ జిల్లాల కలక్టర్లకు ఆదేశిచారు.

శనివారంనాడు హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో ఎన్నికల ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు మూల స్తంభం అని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులందరిని ఓటరుగా నమోదు చేసుకునెలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా 2022 ఓటర్ జాబితాను సిద్ధం చేయాలన, కొత్త ఓటర్ గా నమోదు అయ్యేందుకు సమర్పించిన ఫారాలు, మార్పులు, చేర్పులకు సంబందించిన ఫారాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ గా వారి పేరు నమోదు చేసుకునేందుకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ ఎపిక్ కార్డు లను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ఓటర్ కు అందజేయాలని సూచించారు. స్వీప్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమాలని నిర్వహించాలని, చనిపోయిన వారి వివరాలను ఓటరు జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఏ ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని, ఈవీఎంలను రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో తనిఖీలు నిర్వహించి సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లాలో పరిపూర్ణమైన ఓటర్ జాబితా సిద్ధం చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఓటర్ల నమోదు మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించిన ఫారాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎపిక్ కార్డు డౌన్లోడ్ పైఅవగాహనా చేపడతామని అన్నారు.ఈ సమవేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ వాసు చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Share This Post