18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వారికి ఓటు నమోదు చేసుకోవాలి : రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్

వార్త ప్రచురణ.
తేదీ.18.09.2021.
ములుగు జిల్లా.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల సీఈవో శశాంక్ గోయల్ గారు జిల్లా కలెక్టర్స్ తో శనివారం రోజున వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్లతో 2022 ప్రత్యేక ఓటరు నమోదు పెండింగ్ వివరాలు, ఈ ఎపిక్ కార్డులు, స్వీప్ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
2022 ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్త ఓటర్ గా నమోదు అయ్యేందుకు సమర్పించిన ఫారాలు మార్పులు,చేర్పులకు సంబంధించి న ఫారాలు పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా వారి పేరు నమోదు చేసుకునేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ ఎపిక్ కార్డు డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ఓటరుకు అందజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్వో రమాదేవి గారు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ లో నిర్మాణంలో ఉన్న ఇవీయం గోదాం పనులను పరిశీలించారు.ఈ గోదాం నాణ్యత ,పరిమాణాలను ఆర్ అండ్ బి., ఇ ఇ వెంకటేష్ గారిని అడిగి తెలుసుకున్నారు. ఈ
గోదాం నిర్మాణం అక్టోబర్ మొదటి వారం లోగా పూర్తి కావలసినది గా డి ఆర్ వో రమాదేవి సంబంధిత అధికారుల కు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, కలెక్టరేట్ ఏ. ఓ.,శ్యామ్ , డిపిఆర్వో ప్రేమలత,
ములుగు ఎమ్మార్వో సత్యనారాయణ స్వామి, స్వీప్ నోడల్ అధికారి దేవరాజ్, ఎలక్షన్ డిటి వి. రాజు పాల్గొన్నారు

Share This Post