18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ ఓటరు జాబితాను పకడ్బందిగా రూపొందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్ తెలిపారు.

ప్రచురణార్ధం

అక్టోబరు, 27,ఖమ్మం –

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ ఓటరు జాబితాను పకడ్బందిగా రూపొందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్ తెలిపారు. ఓటరు ధృవీకరణ ఓటరు జాబితా తయారీ, గరుడ యాప్ వంటి పలు అంశాల పై ఆయన బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేసామని తెలిపారు. జిల్లాలో ఓటరు జాబితా నమోదు ప్రక్రియ పై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో బూత్ స్థాయి అధికారులు నిర్వహించిన ఇంటింటి సర్వే ఆధారంగా మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగిస్తూ వాటిని ప్రత్యేకంగా రూపొందించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, అడ్రస్ ను, పోలింగ్ కేంద్రాల జి ఐ ఎస్ ద్వారా క్యాప్చరింగ్, ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జాబితా చేపట్టిన సమాచారాన్ని సంబంధిత అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందుతున్న వారి జాబితా ప్రత్యేకంగా రూపొందించాలని, అదే సమయంలో వివిధ వయసులో గల వారి జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నవంబర్ 1 2021 న ముసాయ ఓటరు జాబితా విడుదల చేయాలని, నవంబర్ 30,2021 వరకు సదరు జాబితా పై ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించాలని, రెండు శనివారాలు, ఆదివారాలు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని డిసెంబర్ 20,2021లోగా అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, 2022 జనవరి 5వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఒటు హక్కు కల్పించేందుకు వీలుగా విద్యాలయాలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలోని డిగ్రీ/వృత్తి నైపుణ్య కళాశాలలో ఎలక్టోరల్ లీటిరస్ క్లబ్బులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఓటరు నమోదు కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ప్రత్యేక కార్యక్రమాలు రుపొందించి అమలు చేయాలని సూచించారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని, స్విప్ కార్యక్రమాల నిర్వహణ పట్ల జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఓటర్లకు తమ పోలింగ్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ గరుడ యాప్ ను రుపొందించిందని, దీని పై ప్రజలలో విస్తృత ప్రచారం గావించాలని ఆయన ఆదేశించారు. గరుడ యాప్ లో పోలింగ్ స్టేషన్ వివరాలు, వాటి రూట్ మ్యాప్ సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని, వీటికి సంబంధించి బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న ఈవిఎం గోడౌన్లను ప్రతి మాసం తనిఖీ చేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లాలో ప్రతి మాసం ఈవిఎం గోడౌన్ తనిఖీ చేస్తున్నామని నిర్దేశించిన గడువులోగా తుది ఓటరు జాబితాలో ప్రచురించేలా జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని కలెక్టర్ వివరించారు.

నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, ఖమ్మం, కల్లూరు ఆర్.డి.ఓలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, ఎన్నికల డి.టి.లు రాంబాబు, రాజేష్, రవీందర్, పవన్, తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

 

Share This Post