18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలని, వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి  వ్యాక్సిన్  వేయాలని, వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని    జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

శనివారం గద్వాల మండలం జమ్మి చేడు గ్రామ పంచాయతి కార్యాలయంలోఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని 18 సంవత్సరాలు పైబడిన వారు ఎంత మంది ఉన్నారు, ఎంతమందికి వాక్సిన్ వేశారు, ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారని వైద్య అధికారులను  అడిగి  తెలుసుకున్నారు. గ్రామంలో  మొత్తం 3947 జనాభాలో  ఇప్పటివరకు 2642 మందికి వాక్సినేషన్ పూర్తి  అయినదని ,ఇంకా  మిగిలిన వారందరికీ, ఏఎన్ఎంలు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు రోజుకి రెండు సార్లు ఇంటింటికి తిరిగి  వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజలకు  అవగాహన కల్పించి  వాక్సిన్ వెయ్యాలని అన్నారు. గ్రామంలో ప్రజలు అందరు వాక్సిన్ వేసుకునేలా వారిని ప్రోత్సహించి, 100% వాక్సినేషన్ పూర్తి చేయాలనీ వైద్యాధికారులకు ఆదేశించారు.

జిల్లా లోని వైద్య అధికారి  కార్యాలయంలో  మాత శిశు సంరక్షణ కేంద్రం లోని వ్యాధి నిరోధిక టీకా విభాగాన్ని పరిశీలించారు. ఎంతమందికి  టీకాలు వేశారని  అడిగి తెలుసుకున్నారు. మాత శిశు సంరక్షణ కేంద్రం అందించిన ఎం.సి.బి కార్డు లను పరిశీలించారు.

అనంతరం జిల్లా లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని డయాగ్నొస్టిక్ సెంటర్, డయాలసిస్, బ్లడ్ బ్యాంకు, జనరల్ వార్డ్, సర్జికల్ వార్డ్, లేబర్ రూమ్, ఓ.పి.సెంటర్, ఐ.పి. సెంటర్, ఆక్సిజన్ ప్లాంట్, టీ హబ్, చిన్న పిల్లల వార్డులను, గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకంతో వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనీ, పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని వారికి ఎల్లప్పుడూ మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా వైద్యాధికారులు, హాస్పిటల్  సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.. ఆసుపత్రిలో  మొత్తం ఎన్ని ఐ.సి.యు బెడ్లు, వెంటిలేటర్లు, ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. గర్భిణిలకు కే.సి.ఆర్ కిట్లను అందించాలని, వృద్ధులు మరియు ధీర్గకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి పై శ్రద్ధ చూపాలని అన్నారు. ఆసుపత్రి లో ప్రతి ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ రోగులకు వైద్యం అందించాలని అన్నారు. ఆసుపత్రిలోని  వైద్య సేవల గురించి ఆస్పత్రికి వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు.  ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా వైద్యాధికారి చందు నాయక్, డాక్టర్ శశికళ,డాక్టర్ కిషోర్ కుమార్,  వృశాలి, డాక్టర్ శోభారాణి, డాక్టర్ మారుతినందన్,  మధుసూదన్ రెడ్డి, రవి కుమార్, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post