18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలి …..
ఓటరు కార్డు కు
ఆధార్ అనుసంధానం చేయాలి
ఈ నెల 3,4 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం
డిసెంబర్ 8 వరకు క్రొత్త ఓటరుగా నమోదు,మార్పులు, చేర్పులకు అవకాశం
…. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు.
గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు, ఏ ఈ ఆర్ ఓ లు, బిఎల్ఓ సూపర్వైజర్లతో ఓటరు నమోదు పురోగతి, ఓటరు జాబితా సవరణ తదితరాలపై సమీక్షించారు.
2023 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
17 సంవత్సరాలు పైబడిన వారు ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేయాలన్నారు.
18 సంవత్సరాలు నిండిన వారిని నూతన ఓటరుగా నమోదుకు విస్తృత ప్రచారం కల్పించి ఎక్కువ మంది ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గల డిగ్రీ, మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలను స్వయంగా సందర్శించి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించడంతో పాటు ఓటరుగా నమోదు కానీ వారందరినీ అక్కడికక్కడే నమోదు చేయించాలని తెలిపారు.
తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాలని , డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో చేసుకోవాలని, డిసెంబర్ 8 వరకు తమ సమీప బి.ఎల్. ఓ లను సంప్రదించి ఓటరుగా నమోదు చేసుకోవాలని విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
సామాజిక మాద్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి అర్హత గల వారందరూ ఓటర్ గా నమోదు చేసుకునేలా చూడాలని కలెక్టర్ కోరారు.
ఈ నెల 3, 4 తేదీలలో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటరు నమోదు కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాల గురించి ప్రజలకు ముందస్తు టాం టాం ద్వారా తెలియజే యాలని సూచించారు.
ఓటరు జాబితా నుండి పేర్లు తొలగించే సందర్భంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లిపోయిన ఓటర్ల తొలగింపు విషయంలో తప్పనిసరిగా ధృవీకరణ పత్రం ఆధారంగా మాత్రమే వారి ఓటును తొలగించాలని ఆదేశించారు.
జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
ఓటర్ కార్డుకు ఆధార్ సీడింగ్ అర్బన్ లో 90 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం పూర్తి కావాలన్నారు.
బూత్ స్థాయి అధికారులు ఆయా గ్రామంలో ఓటరు జాబితాను ప్రదర్శించి గ్రామస్తులను వారి పేర్లను సరి చేసుకోవాలని చెప్పాలన్నారు. నమోదుకు సంబంధించి అవగాహన కల్పించాలన్నారు.
ఫారం 6 ,7 ,8 లలో వచ్చిన దరఖాస్తులను వెంటనే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని
సూ చించారు. ఏ ఈ ఆర్ ఓ లు ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా విచారణ చేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజార్షి షా, రెవిన్యూ డివిజనల్ అధికారులు నగేష్, రమేష్ బాబు, అంబాదాస్ రాజేశ్వర్, ఏ ఈ ఆర్ ఓ లు, ఎలక్షన్ విభాగపు సూపర్డెంట్, బిఎల్ఓ సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.