18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేర్లు నమోదయ్యేలా తహసిల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఓటరు జాబితా( ఎలక్టోరల్ రోల్) పరిశీలకులు (పరిశ్రమల శాఖ కమిషనర్) మానిక్ రాజ్ కన్నన్, ఐ ఎ ఎస్ , తెలిపారు.

పత్రికా ప్రకటన                                                             తేదీ 6.11.2021

18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేర్లు నమోదయ్యేలా తహసిల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఓటరు జాబితా( ఎలక్టోరల్ రోల్) పరిశీలకులు (పరిశ్రమల  శాఖ కమిషనర్)  మానిక్ రాజ్ కన్నన్, ఐ ఎ ఎస్ , తెలిపారు.

శనివారం ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కార్యక్రమంలో భాగంగా కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు తహసిల్దార్లు, పొలిటికల్ పార్టీల ప్రతి నిదులతో ఏర్పాటు చేసిన సమావేశం లో ప్రత్యేక ఓటరు  నమోదు, సవరణ, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, మరణించిన వారి పేర్లను తొలగించి  ఎలాంటి పొరపాట్లు  లేని ఓటరు జాబితాను రూపొందించాలని అన్నారు. ప్రత్యెక ఓటరు నమోదు ప్రక్రియను తహసిల్దార్లు తప్పనిసరిగా తనిఖి చేయాలనీ అన్నారు. మండల తహసిల్దార్లు మీ పరిదిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలందరికి ఓటరు నమోదు కార్యక్రమం పై అవగాహన కల్పించాలన్నారు. బూత్ లెవల్ అధికారులను నియమించి వారికీ శిక్షణ  ఇవ్వాలన్నారు. ఓటర్ నమోదు ప్రక్రియ గురించి ప్రజలకు తెలియజేయాలని, ఓటర్ లకు సంబంధించిన  అభ్యంతరాలను  స్వీకరించి, ఓటర్ జాబితా లో  సవరణలు, మార్పులు, చేయాలనీ అన్నారు.   అన్ని పోలింగ్ స్టేషన్ లలో 6, 6A, 7, 8, & 8A ఫార్మ్స్  అందుబాటులో ఉంచాలని,  ప్రతి మండల నోటీసు బోర్డుల లో ఓటు నమోదు గురించి డిస్ప్లే చేయాలనీ అన్నారు.  జాబితా లో పేరు తొలగించాలనుకుంటే ఫార్మ్ 7 లో వ్యక్తిగత నోటీసు ఇచ్చి ఏడు రోజుల తర్వాత ఆదారాల తో జాబితా నుండి తొలగించాలన్నారు. జాబితా లో పేరు, చిరునామా లను సవరించాలనుకుంటే ఫారం 8 ద్వారా చేసుకోవచ్చని తెలిపారు.

ఓటర్ నమోదు విషయమై విస్తృత  ప్రచారం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో టాం టాం ద్వారా  అవగాహన కల్పించి,  ప్రజలను చైతన్య పరచాలనితెలిపారు . ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకోవాల్లన్నారు . ప్రతి రోజు వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు.

జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ  మాట్లాడుతూ తప్పులు లేని ఓటరు జాబితా ను రూపొందించడానికి  అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశామని  ,గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, బూత్ లెవల్ అధికారులతో అన్ని రకాల ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాల్లో అర్హులైన వారందరిని ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు.

సమావేశంలో  జిల్లా రెవిన్యూ అధికారి రాములు , అన్ని మండలాల తహసిల్దార్లు, రాజాకీయ పార్టీల ప్రతినిధులు  సుబాన్, త్యాగరాజు, ప్రబాకర్ రెడ్డి, అబ్రహం,  మదన్ మోహన్, సంబదిత అధికారులు ,తదితరులు  పాల్గొన్నారు.

——————————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  గారిచే జారీ చేయనైనది

Share This Post