18 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన యువతీ యువకులు అందరు ఓటు హక్కు ను నమొదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీహర్ష, రఘురాం శర్మ తెలిపారు.

పత్రికా ప్రకటన                                                                తేది: 25-01-2022

18 సంవత్సరాలు వయస్సు  పూర్తి అయిన యువతీ యువకులు అందరు ఓటు హక్కు ను నమొదు చేసుకోవాలని  జిల్లా అదనపు  కలెక్టర్లు శ్రీహర్ష, రఘురాం శర్మ తెలిపారు.

మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా  కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ   18 సంవత్సరాలు పూర్తి అయిన  ప్రతి ఒక్కరు  ఓటు హక్కును ఓటరు జాబితా లో  నమోదు చేసుకోవాలని  అన్నారు. ప్రజా స్వామ్యం ఫై విశ్వాసం తో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కులం ,మతం ,వర్గం ,భాష ,ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండగ నిర్భయంగా ఓటు హక్కు ను వినియోగించుకోవాలని తెలిపారు. ఓటరు గా  తమ బాధ్యత నిర్వహించుటకె  ఓటరు గుర్తింపు కార్డు పొందాలని ఓటు హక్కు ను వినియోగించుకొని ప్రజా స్వామ్యాన్ని పటిష్ట పరచాలని తెలిపారు. ఓటరు హెల్ప్ లైన్  డౌన్ లోడ్ చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని తెలిపారు.  ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా  జరుగుతుందని, ఈ సంవత్సరం  జిల్లా లో  1990 మందిని కొత్త ఓటర్లు గా నమోదు చేయడం జరిగిందని  తెలిపారు.

“భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని”, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో  ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం కొత్తగా ఓటర్లుగా నమోదైన భీం కుమార్, శ్రీనివాస్ కుమార్, హేమంత్ కుమార్, పవన్, నరేష్, మహేశ్వరి, మ్యాగ సాయి కుమార్, జీనత్ మసుల్దార్, అతిక్  లకు ఎపిక్ కార్డులను అందజేశారు.

కార్యక్రమం లో ఆర్.డి ఓ రాములు, సుపరిడెంట్లు  మదన్ మోహన్, రాజు, ఈ.డి రమేష్ బాబు, ముశాయిధ బేగం, డిపిఆర్ఓ చెన్నమ్మ, కార్యాలయ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయనైనది.

Share This Post