18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ తప్పక వేయించి వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు, వైద్య సిబ్బందికి ఆదేశించారు.

పత్రికా ప్రకటన
16 -9 -2021
జోగులాంబ గద్వాల

18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ తప్పక వేయించి వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు, వైద్య సిబ్బందికి ఆదేశించారు. గురువారం మల్దకల్ మండల కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పల్లే ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతూ18 సంత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కరోనా(కోవిడ్-19) టీకా వేయించుకోవాలనీ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకై క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించడం జరిగిందనీ అందులో భాగంగా ఈరోజు మల్దకల్ మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఈ అవకాశాన్ని 18సంవత్సరాలు నిండిన అందరు యువతీ, యువకులు, పెద్దలు సద్వినియోగం చేసుకోవాలని వారం రోజుల్లో 100% వ్యాక్సినేషన్ పూర్తి కావాలని గ్రామ సర్పంచ్ యాకోబు కు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు, వంటగది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పాఠశాల నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పల్లె ప్రకృతి వనం పరిసరాలు అందంగా తీర్చిదిద్దాలని పిచ్చి మొక్కలు, గడ్డి లాంటివి తొలగించాలని ఆదేశించారు. పర్యాటకులు వచ్చే సమయాన్ని సూచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ ముసాయిదా బేగం, ఎంపీడీవో కృష్ణయ్య, సర్పంచ్ యాకోబు, డాక్టర్ యమున, సెక్రటరీ , వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు…… జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే చేయడమైనది.

Share This Post