18 సంవత్సరాల లోపు బడి ఈడు పిల్లలు చదువుకోకుండా బయట బాలకార్మికునిగా ఉండేందుకు వీలు లేదని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు

18 సంవత్సరాల లోపు బడి ఈడు పిల్లలు  చదువుకోకుండా బయట బాలకార్మికునిగా ఉండేందుకు వీలు లేదని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.  జనవరి 1తేదీ నుండి 31 వరకు  8వ విడత ఆపరేషన్ స్మైల్ నిర్వహణ కోసం సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరామలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన లైన్ డిపార్ట్మెంట్ లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ, బల్యవివాహాలు రూపుమపాలంటే జిల్లా సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫెర్ కమిటీ సభ్యులు మున్సిపాలిటీ, గ్రామీణ స్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.  అసలు ఏ వయసు పిల్లలు ఇటుక బట్టిలలో, పరిశ్రమల్లో, హోటళ్లలో   పని చేయకూడదు,  పిల్లలను బలవంతంగా యాచక వృత్తిలో పంపిస్తే ఎలాంటి చర్యలు చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది అనే విషయాలపై  ప్రజలకు ముందుగా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసారు.  గ్రామాల్లో, మండలాల్లో, మున్సిపాలిటీల్లో గ్రామ సభలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.  ఇందుకు అనుగుణంగా షెడ్యూల్ సిద్ధం చేసి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారో షెడ్యూల్ కాపీ తనకు ఇవ్వాల్సిందిగా జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.     ఈ సారి కోవిడ్ ఉన్నందున ఆపరేషన్ స్మైల్ సందర్బంగా  నిబంధనలు పాటించాలని అన్నారు.  పోలీస్ శాఖ, రెవెన్యూ, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమన్వయం తో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో బడి ఈడు పిల్లల జాబితాను రెస్క్యూ బృందం సభ్యులకు అందజేయాలని జిల్లా విద్యా శాఖను ఆదేశించారు.  ఎక్కడైనా పిల్లలను పనిలో బానిసగా ఒప్పందం చేసుకొని పెట్టుకున్నారేమో అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ అధికారులను సూచించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న అదనపు ఎస్పీ టి.ఎ. భరత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో బాలకార్మిక, బాల్య వివాహాలను అరికట్టడానికి పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు.  రెస్క్యూ కొరకు వాహన ఏర్పాటు, పోలీస్ సిబ్బందిని కేటాయించడం జరుగుతుందన్నారు.  ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ కళాకారులు క్షేత్రస్థాయిలో ఆటపాటల ద్వారా అవగాహన కల్పిస్తున్నారని తెలియజేసారు.

ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డి.డబ్ల్యూ.ఓ వేణుగోపాల్, సి.డబ్ల్యూ.సి చైర్మన్ అశోక్, డి.సి.పి.ఓ  కుసుమలత, లేబర్ ఆఫీసర్ రాజ్ కుమార్, జిల్లా అధికారులు, సి.డి.పి.ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post