18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి:: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్

జనగామ, డిసెంబర్ 4: జిల్లాలో 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎలక్టోరల్ స్పెషల్ సమ్మరి రివిజన్, ఫోటోఎలక్ట్రల్ రోల్ పై అధికారులతో ఎన్నికల ప్రధాన అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నవంబర్ 1 నుండి 30 వరకు వచ్చిన కొత్త ఓటరు నమోదు ఫారం – 6, 7, 8, 8ఎ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ఓటరు నమోదు సమస్యలపై, ఓటరు జాబితాలో పేర్ల మార్పులు, ఫోటో లేకపోవడం తదితర సమస్యల పై వచ్చిన దరఖాస్తులను స్థానికంగా విచారణ జరిపి డిసెంబర్ 20 లోగా పరిష్కరించాలన్నారు. గరుడ యాప్ ద్వారా ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. గరుడ యాప్ ను ఎలా ఉపయోగించాలో బూతు లెవల్ అధికారులకు (బిఎల్ఓ) పూర్తి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఓటరు హెల్ప్ లైన్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీడియా, పత్రికల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. జిల్లాలో స్వీప్ యాక్టివిటీ నిర్వహించి ఓటర్లను చైతన్యపరచాలన్నారు. 1 జనవరి, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయిన యువతీ యువకులు ఆన్లైన్ ద్వారా గాని, ఫారం 6 ద్వారా గాని ఓటరు జాబితాలో తమ పేరులను నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఎన్నికలకు సంబందించి ఖర్చు చేసిన బిల్లులు పెండిoగ్ లో ఉంటే సత్వరమే వివరాలు సమర్పించాలన్నారు. ఓటరు జాబితాను ఆన్లైన్ లేదా హార్డ్ కాపీ కాకుండా సిడీ, పెన్ డ్రైవ్ ల ద్వారా అవసరమైన పొలిటికల్ పార్టీ లకు ఇవ్వాలని అన్నారు. ఈఆర్ఓ లు, ఎఈఆర్ఓలు, బిఎల్ఓలతో క్షేత్ర స్థాయిలో ఓటరు నమోదు, మార్పులు చేర్పుల వివరాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియ ను మార్పుల చేర్పుల విషయoలో ఎలాంటి సమస్యలు లేకుండా బిఎల్ఓలు,ఈఆర్ఓలు, ఎఈఆర్ఓలు, నోడల్ అధికారులతో గరుడా యాప్, స్వీప్ యాక్టివిటీస్ పై తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఎలక్టోరల్ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, రెవెన్యూ డివిజనల్ అధికార్లు సిహెచ్. మధుమోహన్, కృష్ణవేణి, ఎస్డిసి మాలతి, ఎన్నికల పర్యవేక్షకులు ఎతేషాంఅలీ, తహసిల్దార్లు, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post