18 సంవత్సరాల వయస్సు నిండిన జిల్లాలోని ప్రతి ఒక్కరూ తప్పకుండా covid19 వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 16 (గురువారం).

18 సంవత్సరాల వయస్సు నిండిన జిల్లాలోని ప్రతి ఒక్కరూ తప్పకుండా covid19 వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ ను ఎదుర్కొని రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యవంతంగా జీవించాలంటే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ కరోనా వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందని దానిలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, మరియు మహాదేవపూర్, చిట్యాలలో గల సామాజిక ఆసుపత్రులు, భూపాలపల్లి పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్, సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేస్తున్నామని ఎలాంటి అపోహలకు పోకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ప్రజలంతా సాధారణ జీవితం గడపడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు వదిలి బయటకు రావడం జరుగుతుందని ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడం వ్యాక్సిన్ వల్ల మాత్రమే సాధ్యమని వచ్చే నెల నుండి పండుగల సీజన్ రానుందని అదేవిధంగా పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు అత్యధికంగా జరిగే సమయం ప్రారంభం కానున్నందున ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు ప్రభుత్వం పడుతున్న ఆరాటాన్ని గుర్తించి కచ్చితంగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో 5606 మందికి వ్యాక్సిన్ వెయ్యడం జరిగిందని కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం మూలంగా ఎలాంటి దుష్ఫలితాలు కలుగాలేదని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనాపై ఏమైనా అపోహలు ఉంటే సమీప ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందిని సంప్రదించి నివృత్తి చేసుకోవాలి కానీ తప్పకుండా చేసుకోవాలని ఆ ప్రకటనలో జిల్లా కలెక్టర్ సూచించారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది

Share This Post