18 సవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వ్యాకినేషన్ వేయించుకోవాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

18 సవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వ్యాకినేషన్ వేయించుకోవాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన
జిల్లా లో 18 సవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డి హరిచందన సూచించారు. బుధవారం సాయంత్రం నారాయణపేట మండలం లోని వివిధ గ్రామ పంచాయతీ లలో ఉన్న PHC లలో జరుగుచున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాలలో సమావేశాలు నిర్వహించి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని, ముందురోజు టామ్ టామ్ చేసి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ బారినపడి చాలామంది మరణించారని ఏ గ్రామం అయితే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయితే ఆ గ్రామని కి సెర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని సూచించారు. గ్రామం లో ఉన్న ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల గ్రామం ఆరోగ్య గ్రామం గా మారుతుందన్నారు. గ్రామాలు, మండలాలు, ఆన్నీ మున్సిపాలిటీల్లో వందశాతం వ్యాక్సిన్ వేయించుకునేవిధంగా చేసి నారాయణపేట జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలు వ్యాక్సిన్ పట్ల ఎలాంటి భయాలకు, అపోహలకు గురికాకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం అమ్మిరెడ్డి పల్లి గ్రామం లో పర్యటిస్తూ ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోలేదు ఓ జాబితాను తయారు చేసుకొని పంచాయతీ సెక్రటరీ ANM సర్పంచ్ గ్రామం లో పర్యటించి వారికి ఒప్పించి వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని గ్రామాలలో టామ్ టామ్ వేయించాలన్నారు. జీవనోపాధి కై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలను సేకరించి వారు వ్యాక్సినేషన్ వేసుకున్నార లేదా అనే విషయాన్ని ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ అయినవారి దగ్గర తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అమ్మిరెడ్డి పల్లి కోటకొండ మరియు అభంగపూర్ PHC ప్రాంగణం గ్రామ పంచాయతీ లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్రారెడ్డి, జిల్లా ఆరోగ్యశాఖాదికరి డాక్టర్ రాంమనోహర్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సంతోషిని, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

Share This Post