18-08-2021*బృహత్ పల్లె ప్రకృతి వనం,పల్లె ప్రకృతి వనం పనుల చెల్లింపు లో నిర్లక్ష్యం వహించ వద్దు:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

*ఎం.పి.డి.ఓ.లు,ఎం.పి.ఓ.లు,ఏ.పి.ఓ.లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మండలంల వారిగా బృహత్ పల్లె ప్రకృతి వనం,పల్లె ప్రకృతి వనం,వైకుంఠ దామం ల ప్రగతి,చెల్లింపుల పై  సమీక్ష*                          నల్గొండ,ఆగస్ట్ 18.పల్లె ప్రగతి పనుల్లో భాగంగా గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రకృతి వనం లు ఏర్పాటు, మండలం లో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు పనుల ప్రగతి,చెల్లింపు లో అలసత్వం వహించ వద్దని,నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి  ఎం.పి.డి.ఓ.లు,ఎం.పి.ఓ.లు,ఏ.పి.ఓ. లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పల్లె ప్రకృతి వనం లు,బృహత్ పల్లె ప్రకృతి వనం లు ఏర్పాటు, వైకుంఠ దామం లు ప్రగతి చెల్లింపు ల పై జిల్లా కలెక్టర్ మండలం ల వారిగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలం లో బృహత్ పల్లె ప్రకృతి వనం లు ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని,టాస్క్ వారిగా చెల్లింపు లలో అనేక మండలాలు వెనుక బడి ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.వచ్చే శుక్రవారం లోగా బృహత్ పల్లె ప్రకృతి వనం లు ఏర్పాటు లో పనులు టాస్క్ వారిగా పూర్తి చేయడం,చేసిన పనులకు చెల్లింపు 70 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.70 శాతం కన్నా వచ్చే శుక్రవారం లోగా చెల్లింపు తక్కువ ఉంటే సంబంధిత ఎం.పి.డి.ఓ.బాధ్యత వహించాలని,చార్జీ మెమో జారీ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు.పల్లె ప్రకృతి వనం లు పనులు కూడా టాస్క్ వారిగా పూర్తి చేసి వచ్చే శుక్రవారం లోగా అన్ని మండలం లలో 50 శాతం చెల్లింపు పూర్తి చేయాలని,50 శాతం కంటే తక్కువ పేమెంట్ ఉంటే సంబంధిత ఏ.పి.ఓ.కు చార్జీ మెమో జారీ చేసి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.వైకుంఠ దామంలు పెండింగ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని,పేమెంట్ కూడా వెంటనే చేయాలని అన్నారు.బృహత్ పల్లె ప్రకృతి వనం లు ఏర్పాటు ప్లాంటేషన్ పూర్తి చేయాలని,ఫెన్సింగ్,నేమ్ బోర్డ్,గెట్ ఇతర మౌలిక పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.పల్లె ప్రకృతి వనం,బృహత్ పల్లె ప్రకృతి వనం  వేజెస్ మాత్రమే కాకుండా  లెవెలింగ్,రవాణా, ఇతరత్రా టాస్క్ వారిగా పనులు పూర్తి చేయాలని అన్నారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,డి.పి.ఓ.లు వెనుక బడిన మండల లలో పర్యటించి పర్యవేక్షణ చేయాలని అన్నారు.సస్పెండెడ్, రిజెక్టేడ్ పే మెంట్స్ రివ్యూ చేసి క్లియర్ చేయాలని ఎం.పి.డి.ఓ.లను ఆదేశించారు.పనులు పూర్తి చేసి, ఖర్చు పెట్టిన నిధులు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.ఈ వి.సి.లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్, జడ్.పి.సి.ఈ. ఓ.వీర బ్రహ్మ చారి తదితరులు పాల్గొన్నారు.

Share This Post