18-8-2021*బతుకమ్మ చీరల పంపిణీ పై సమీక్షించిన అదనపు కలెక్టర్*

నల్గొండ, ఆగస్ట్ 18 .దసరా కానుకగా మహిళలకు సెప్టెంబర్ మొదటి వారం లో బతుకమ్మ చీరల పంపిణీ కి ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చాంబర్ లో బతుకమ్మ చీరల పంపిణీ- 2021 సమావేశం నిర్వహించి సమీక్షించారు.నల్గొండ జిల్లాలో తెల్ల రేషన్ కార్డు కలిగిన 18 సం. లు వయసు నిండిన మహిళలకు 5 లక్షల 52 వేల బతుకమ్మ చీరలు మంజూరు అయినట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని 6 నియోజకవర్గాల లో వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం లను గుర్తించి,అక్కడి నుండి మండలాల వారీగా డిస్ట్రిబ్యూషన్ చేసి,మండలాల నుండి ప్రతి గ్రామానికి పంపిణీ నిమిత్తం పంపించ నున్నట్లు తెలిపారు. జిల్లాలో మల్లే పల్లి,మిర్యాలగూడ/,దామరచర్ల,తిప్పర్తి,మునుగోడ్,నిడమనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలు,రైతు వేదిక నకిరేకల్ లను గుర్తించి నట్లు ఆయన తెలిపారు. త్వరలో బతుకమ్మ చీరలు TSCO కార్యాలయం,హైద్రాబాద్  నుండి రాగానే గోదాం లలో భద్ర పరచి  సెప్టెంబర్ మొదటి వారం లో దసరా కానుకగా అర్జులైన లబ్ధి దారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇంచార్జి డి.ఆర్.ఓ.జగదీశ్వర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు,గృహ నిర్మాణ పి.డి.రాజ్ కుమార్,పరిశ్రమల శాఖ జి. యం.గంగయ్య,మార్కెటింగ్ ఏ.డి.శ్రీకాంత్,చేనేత,జౌళి శాఖ డి.ఓ.రంజిత్,డి.ఆర్.డి.ఏ.ఏ.పి.యం.అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post