19.08.2021 Nalgonda Dist *రానున్న దసరా,బతుకమ్మ పండుగల సందర్భంగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు:అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్*

నల్గొండ, ఆగస్ట్ 13.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న దసరా,బతుకమ్మ  పండుగల సందర్భంగా అర్హులైన మహిళలకు కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ నిమిత్తం  రెండు రోజుల్లో  జిల్లాకు రానున్నట్లు అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ తెలిపారు.గురువారం అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి బతుకమ్మ చీరల పంపిణీ కోర్ కమిటీ అధికారులు,తహశీల్దార్ లు,ఎం.పి.డి.ఓ లు,మున్సిపల్ కమిషనర్లు,గోదాం ఇంవ్హార్జి లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి బతుకమ్మ చీరలు గోదాం లలో భద్ర పరచడం,పంపిణీ కి చేయవలసిన ముందస్తు ఏర్పాట్లు పై సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన గోదాం ల భద్రపరచిన తర్వాత,గోదాం ల నుండి గ్రామాలకు ఏ విధంగా చీరలు చేర వేయాలి,అర్హులైన లబ్ధి దారులకు ఏ విధంగా పంపిణీ చేయాలి సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ నిర్దేశం చేశారు. జిల్లాలో 4,68,179 ఆహార భద్రత కార్డులు ఉండగా 5,52,509 మంది అర్హులైన మహిళలను గుర్తించినట్లు తెలిపారు.18 సం. లు నిండిన మహిళలు  బతుకమ్మ చీరలు  పంపిణీ కి అర్హులని ఆయన తెలిపారు.వార్డు వారీగా,చౌక ధర దుకాణం వారీగా అర్హుల జాబితా  తహశీల్దార్ లకు అంద చేయడం జరుగుతుందని అన్నారు.ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం లో ఒక  గోదాం చొప్పున ఆరు బఫర్ గోదాం లు బతుకమ్మ చీరలు భద్రపరచుటకు గుర్తించి నట్లు తెలిపారు. నల్గొండ నియోజక వర్గం లో తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్  లో,మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం లో మిర్యాలగూడ/దామరచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో,దేవరకొండ నియోజక వర్గం లో కొండ మల్లెపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో,నాగార్జున సాగర్ నియోజక వర్గం పరిధి లో నిడమనూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో,నకిరేకల్ అసెంబ్లీ నియోజక వర్గం లో రైతు వేదిక కార్యాలయం లు గుర్తించినట్లు తెలిపారు.ఎం.పి.డి.ఓ.,తహశీల్దార్, ఎం.పి.ఓ.లతో మండల కమిటీ లు ఏర్పాటు చేసినట్లు, మండల కమీటీ గ్రామంలో చీరలు సురక్షితంగా భద్రపరచేందుకు గోదాం లు గుర్తించాలని,ఎం
పి.డి.ఓ.లు నియోజకవర్గం లో బఫర్ గోదాం ల నుండి మండలం వారీగా కలెక్ట్ చేసుకొనుటకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ  భవనం లలో స్టోరేజ్ పాయింట్ గుర్తించాలని, చౌక ధర దుకాణాల్లో భద్రపర్చ రాదని,ఎం.పి.డి.ఓ.లు గ్రామ కమిటీ లు ,గ్రామం లో గోదాం లో భద్రపరచుటకు ఇంచార్జి లు నియమించాలని ఆయన ఆదేశించారు.ఇంచార్జి రికార్డ్ నిర్వహణ చేయాలని అన్నారు.పంచాయతి కార్యదర్శి,వి.ఆర్.ఓ.,వి.ఆర్.ఏ.,చౌక ధర దుకాణం డీలర్ లతో గ్రామ కమిటీ లు ఏర్పాటు చేయాలని,పట్టణం లో అర్బన్ బిల్ కలెక్టర్,చౌక ధర దుకాణం డీలర్, వార్డ్ ఆర్గనైజేషన్ ఉంటారని అన్నారు.
పౌర సరఫరాల శాఖ ఈ. పి.డి.ఎస్.సైట్  ద్వారా లబ్ధిదారుల జాబితా అందచేస్తారని,తహశీల్దార్ లు చౌక ధర దుకాణం వారీగా లబ్ధిదారుల జాబితా గ్రామ కమిటీ కి అందచేసి అక్ నాలెడ్జ్ పొందాలని స్పష్టం చేశారు.డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ ల ద్వారా  బతుకమ్మ చీరలు  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పంపిణీ నిర్వహించాలని, రికార్డ్ నిర్వహించాలని ఆయన సూచించారు.ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఇంచార్జి డి.ఆర్.ఓ.జగదీశ్వర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు,ఇంచార్జి చేనేత,జౌళి శాఖ ఏ.డి.రంజిత్,మార్కెటింగ్ ఏ.డి.శ్రీకాంత్,డి.ఆర్.డి.ఏ.ఏ.పి.యం.అరుణ్,సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం తదితరులు పాల్గొన్నారు

Share This Post