1971 ఇండో పాక్ యుద్ధం లో పాల్గొన్న మాజీ సైనికులకు సన్మానం, విజయ జ్వాల ను అందుకున్న రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ రమేష్ కుమార్,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

పత్రికా ప్రకటన
1971 ఇండో పాక్ యుద్ధం లో పాల్గొన్న మాజీ సైనికులకు సన్మానం
50 వ స్వర్నియా విజయ్ వర్ష్-1971 విజయ జ్వాల జిల్లాకు చేరిక,
నల్గొండ,సెప్టెంబర్ 9.1971 లో ఇండో-పాక్ యుద్ధం జరిగి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 50 వ స్వర్నియా విజయ్ వర్ష్ విజయ జ్వాల నావికా శాఖ ద్వారా విశాఖ పట్నం నుండి విజయవాడ మీదుగా గురువారం నల్గొండ చేరుకుంది.నల్గొండ పానగల్ బ్రిడ్జి సైనిక సంక్షేమ కార్యాలయం వద్ద రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ రమేష్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి మక్బూల్ అహ్మద్ లు విజయ జ్వాల ను పోలీస్ బ్యాండ్ మేళా, తో అందుకున్నారు.అనంతరం ఎన్. సి.సి.క్యాడేట్ లు,మాజీ సైనికులు,క్రీడాకారులు ర్యాలీ గా చిన వెంకట రెడ్డి పంక్షన్ హాల్ కు చేరుకున్నారు.అక్కడ ఏర్పాటు చేసిన సమావేశం లో నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1971 ఇండో పాక్ యుద్దం లో వీర జవాన్ ల త్యాగం వల్లే భారత్ యుద్దం లో విజయం సాధించిందని అన్నారు.యుద్ధం లో వీర మరణం పొందిన సైనికులకు నివాళులు అర్పించారు.యుద్దం లో పాల్గొన్న నల్గొండ ఉమ్మడి జిల్లాకు చెందిన 30 మంది సైనికులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డి.ఐ. జి.ఏ.వి.రంగ నాథ్,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,నావికా దళ అధికారి వి.ఎస్.సి.రావు, మున్సిపల్ చైర్మన్ యం.సైది రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్,మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పాపి రెడ్డి,డి.ఎస్.పి.వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పల్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post