2 నెలల పాటు చిన్న వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—-1

తేదీ.20.7.2022

ప్రచురణార్థం----1 తేదీ.20.7.2022 2 నెలల పాటు చిన్న వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి జగిత్యాల, జూలై 20:- ధర్మపురి ప్రాంతంలో గోదావరి ఒడ్డున ఉన్న చిన్న చిన్న వ్యాపారులు 2 నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి రవి సూచించారు. బుధవారం ధర్మపురి పట్టణంలోని గోదావరి ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. గోదావరి నదీ ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పై ప్రాంతాల నుండి వచ్చిన భారీ వరదల కారణంగా అనేక గ్రామాల్లో ఇండ్లు పాక్షికంగా కొన్ని సంపూర్ణంగా దెబ్బతిన్నాయని, వారికి ప్రజా ప్రతినిధులు అధికారులతో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పరిహారం అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొంతమంది ఇంట్లో నీరు రావడం వల్ల సామాగ్రి నష్టపోయారని, వారికి సైతం పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. వర్షాల కారణంగా అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, వరద ముప్పు అధికంగా ఉన్న గ్రామాలలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని కలెక్టర్ అన్నారు.  గోదావరి నది ఒడ్డున చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే 40 కుటుంబాలు రెండు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని, చిన్న బెంచి , తోపుడుబండ్ల లో మాత్రమే వ్యాపారం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.అనంతరం గోదావరి నది ఒడ్డున ఉన్న షాపులను షాపులను తొలగిస్తూ వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.  డి సి ఎం హెచ్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దార్ వెంకటేష్ ,సంబంధిత అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.
2 నెలల పాటు చిన్న వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల, జూలై 20:- ధర్మపురి ప్రాంతంలో గోదావరి ఒడ్డున ఉన్న చిన్న చిన్న వ్యాపారులు 2 నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి రవి సూచించారు. బుధవారం ధర్మపురి పట్టణంలోని గోదావరి ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. గోదావరి నదీ ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు.

జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పై ప్రాంతాల నుండి వచ్చిన భారీ వరదల కారణంగా అనేక గ్రామాల్లో ఇండ్లు పాక్షికంగా కొన్ని సంపూర్ణంగా దెబ్బతిన్నాయని, వారికి ప్రజా ప్రతినిధులు అధికారులతో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పరిహారం అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొంతమంది ఇంట్లో నీరు రావడం వల్ల సామాగ్రి నష్టపోయారని, వారికి సైతం పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.

వర్షాల కారణంగా అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, వరద ముప్పు అధికంగా ఉన్న గ్రామాలలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని కలెక్టర్ అన్నారు.

గోదావరి నది ఒడ్డున చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే 40 కుటుంబాలు రెండు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని, చిన్న బెంచి , తోపుడుబండ్ల లో మాత్రమే వ్యాపారం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.అనంతరం గోదావరి నది ఒడ్డున ఉన్న షాపులను షాపులను తొలగిస్తూ వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

డి సి ఎం హెచ్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దార్ వెంకటేష్ ,సంబంధిత అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.

Share This Post