(20.07.2022) జిల్లా స్థాయి లేఅవుట్ అప్రూవల్ కమిటీ సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.     తేది:20.07.2022,  వనపర్తి.

లే అవుట్లను క్రమబద్ధీకరించుటకు పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
బుధవారం ఐ డి ఓ సి. జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో రెవెన్యూ, ఆర్ అండ్ బి, మున్సిపల్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డిస్టిక్ లెవెల్ లేఅవుట్ అప్రూవల్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో లే అవుట్లు క్రమబద్ధీకరించడానికి కమిటీ పర్యవేక్షణ చేసి అన్ని మున్సిపాలిటీలలోని లే అవుట్లను క్రమబద్దీకరించేందుకు అయా శాఖల అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. వనపర్తి పట్టణంలో ఒకటి క్రమబద్దీకరించినట్లు, ఒకటి పెండింగ్లో ఉంచినట్లు ఆమె తెలిపారు. లే అవుట్ల క్రమబద్ధీకరణ పనులు పెండింగ్ లేకుండా వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవిన్యూ) డి.వేణు గోపాల్, వనపర్తి మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ జాన్ కృపాకర్, రెవెన్యూ శాఖ అధికారులు, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఏ.ఈ, ఇరిగేషన్ శాఖ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారి, తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post