(20.07.2022) వనపర్తి జిల్లాలోని వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు : రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన     తేది:20.07.2022, వనపర్తి.

వనపర్తి జిల్లాలోని వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
బుధవారం జిల్లాలోని వనపర్తి, పెబ్బేర్, ఘనపూర్, పెద్దమందడి, శ్రీరంగాపురం మండలాలలో వివిధ అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, రైతులకు, గృహాలకు నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఘనపూర్ మండలం లోని అల్లమాయపల్లి గ్రామంలో 16 రెండు పడక గదుల ఇండ్లకు శంకుస్థాపనలు, ఘనపూర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు ప్రారంభోత్సవం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
పెద్దమందడి మండలంలోని చీకరు చెట్టు తాండాలో ఎస్.టి. కమ్యూనిటీ భవనం ప్రారంభోత్సవం, అల్వాల, దొడగుంటపల్లి గ్రామ పంచాయతీలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు ప్రారంభోత్సవం, పెద్దమందడి సర్వవర్గ సామూహిక భవనం నిర్మాణానికి శంకుస్థాపనలు నిర్వహించినట్లు ఆయన సూచించారు. వనపర్తి మండలంలోని అచ్యుతాపురం సబ్ స్టేషన్ శంకుస్థాపన, రాజాపేట సమీపంలో జిల్లా ఎలక్ట్రికల్ స్టోర్, ఆర్ డి ఓ. కార్యాలయం సమీపంలో సబ్ స్టేషన్ కు శంకుస్థాపనలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. శ్రీరంగాపురం మండలంలోని తాటిపాముల గ్రామంలో రూ. ఒక కోటి 91 లక్షలతో 33/11 కె.వి. సబ్ స్టేషన్ కు శంకుస్థాపన, శ్రీరంగాపురం పట్టణ పరిధిలో రూ. 75 లక్షలతో సర్వవర్గ సామూహిక భవనం నిర్మాణానికి శంకుస్థాపనలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన, పెబ్బేరు పట్టణ పరిధిలో రూ. 75 లక్షలతో సర్వవర్గ సామూహిక భవనం నిర్మాణానికి శంకుస్థాపన, 60 మంది రైతులకు 15 ట్రాన్స్ఫార్మర్స్ అందజేసినట్లు ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, విద్యుత్ శాఖ ఏ.డి, ఏ.ఈ, మున్సిపల్ కౌన్సిలర్లు, వెంకట్ రావు. మధుసూదన్, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post