2017- 18 నుండి 2020- 21 సం.నకు గాను పెండింగ్లో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు సత్వరమే పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన తేది:26.8.2021.
వనపర్తి.
2017- 18 నుండి 2020- 21 సం.నకు గాను పెండింగ్లో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు సత్వరమే పూర్తిచేయాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్ లకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపాల్ తో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి విద్య శాఖలు పునః ప్రారంభించటం జరుగుతుందని, విద్యార్థుల ఉపకార వేతనాలు మంజూరు చేయుటకు ఆన్ లైన్ లో పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిశీలించి పూర్తిచేయాలని, 2 రోజుల్లోగా హార్డ్ కాపీలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ లకు సూచించారు.
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ విద్యార్థులు తమ పాత ఆధార్ కార్డుల స్థానంలో revalidation కొత్త ఆధార్ కార్డులకు దరఖాస్తు చేసుకొని, కొత్త ఆధార్ కార్డులతో స్కాలర్ షిప్ లకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. కళాశాలల్లో పరిసరాలను శుభ్రం చేయించి, ఆయా కళాశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె వివరించారు. విద్యాసంస్థలలో పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను పూర్తి చేసి జాబితాను పది రోజుల్లో సమర్పించాలని ఆమె సూచించారు.
2017-18 నుండి 2020-21 సంవత్సరంలో స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకున్నా విద్యార్థులు, పెండింగ్లో ఉన్న ఉపకారవేతనాలకు విద్యార్థులతో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కొన్ని మండలాల్లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేవని, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని కళాశాలల ప్రిన్సిపల్ లు జిల్లా కలెక్టర్ ను కోరారు.
ఆయా కళాశాలల సిబ్బంది అందరూ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా విద్యార్థులు సోషియల్ డిస్టెన్స్ పాటిస్తూ, శానిటైజర్ చేసుకొని, మాస్కు ధరించి, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కళాశాలలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, జిల్లా ఎస్సీ అధికారి నుషిత, యాదమ్మ, జిల్లా బిసి అధికారి కేశవ్,దిలీప్, జిల్లా మైనార్టీ అధికారి అనిల్, డి ఐ ఓ. జాకీర్, దిలీప్, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు తదితరులు పాల్గొన్నారు.
………….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post