2019 -20 గణాంక దర్శినిని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 12, 2021ఆదిలాబాదు:-

2019-20  ఆర్థిక సంవత్సరమునకు గాను ఆదిలాబాద్ జిల్లా గణాంక దర్శిని ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆవిష్కరించారు. గురువారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం చే రూపొందించబడిన గణాంకాదర్శిని ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు సంబంధించిన సమాచారం ఈ దర్శినిలో పొందుపరచడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆగష్టు 15 న ఆయా మండల తహసీల్దార్ అధికారులు మండల గణాంక దర్శిని లను విడుదల చేయాలని సిపిఒ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, ఎం.డేవిడ్, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post