2019-20 సం. డిస్ట్రిక్ట్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పుస్తక ఆవిష్కరణ : జిల్లా కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి.

ఈరోజు కలెక్టరేట్ నారాయణపేట నందు డిస్ట్రిక్ట్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2019- 20 సంవత్సరానికి సంబంధించి నటువంటి పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఇందులో జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిచందన గారు మరియు నారాయణపేట ఎమ్మెల్యే శ్రీ ఎస్ రాజేందర్ రెడ్డి గారు మరియు అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రారెడ్డి గారు ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీ గోవిందరాజన్ గారు మరియు డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్లు నరసింహులు బందిగి మరియు శ్రీదేవి  గారు పాల్గొన్నారు. ఇందులో  జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ  శాఖలకు సంబందించిన సమాచారంను క్రోడీకరించి వ్రాయనై నది .మరియు ఈ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల విశేషాలను ఫోటోలతో సహా వివరించడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించిన సాధారణ సమాచారం కూడా ఇందులో ఇవ్వడమైనది.

Share This Post