2021 జనాభా జనగణన పకడ్బందీగా నిర్వహించే విధంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                                తేది 06-01 -2022

2021 జనాభా జనగణన పకడ్బందీగా నిర్వహించే విధంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  అధికారులను ఆదేశించారు.

గురువారం సాయంత్రం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు తహశీల్దార్లు, గణాంక అధికారులతో నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతూ 2011 జనాభా గణనను అనుసరించి  కొత్త మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీలో వార్డులకు అనుగుణంగా సెన్సెస్ బ్లాక్ లను విభజించుకోవాల్సి ఉంటుందని తెలిపారు . ఏనుమరేషన్ బ్లాక్ లను పకడ్బందిగ తయారు చేసుకోవాలని, వాటికి అనుగుణంగా హౌజ్ లిస్ట్ బ్లాక్ లను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డు ల వారిగా ఇంటింటి సర్వే నిర్వహించాల్సి ఉంటుందని , ప్రభుత్వం నుండి ఎప్పుడు ఆదేశాలు వచ్చిన గణన మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని ,  అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ లు రఘురాం శర్మ, శ్రీ హర్ష, ఆర్.డి.ఓ రాములు, ఎం.లోకేశ్వర్ రావు డైరెక్టర్ అఫ్ సెన్సెస్ హైదరాబాద్, సి.పి.ఓ లక్ష్మణ్, అన్ని మండలాల తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  జిల్లా గారిచే జారీ చేయనైనది.

Share This Post