2021 జనాభా జనగణన పకడ్బందీగా నిర్వహించే విధంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

2021 జనాభా జనగణన పకడ్బందీగా నిర్వహించే విధంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మండల గణాంక అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జనాభా గణాంక అధికారిణి అనురాధ ద్వారా తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఏ.ఎస్.ఓ లకు జనాభా గణన పై అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 2011 జనాభా గణన కంటే ప్రస్తుతం జిల్లా, మండల పరిధులు మారాయని 33 జిల్లాలుగా ఏర్పడ్డాయని, కొత్త మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీలో వార్డులు మారాయని వాటికి అనుగుణంగా సెన్సెస్ బ్లాక్ లను విభజించుకోవాల్సి ఉంటుందన్నారు. ఏనుమరేషన్ బ్లాక్ లను పకడ్బందిగ తయారు చేసుకోవాలని, వాటికి అనుగుణంగా హౌజ్ లిస్ట్ బ్లాక్ లను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 2021 లోనే జనాభా గణన చేపట్టాల్సి ఉన్న కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రారంభం కాలేక పోయిందని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం నుండి ఎప్పుడు ఆదేశాలు వచ్చిన గణన మొదలు పెట్టేందుకు వీలుగా అన్ని ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా స్టాటాస్టిక్ అధికారిణి అనురాధ ప్రొజెక్టర్ ద్వారా మండల స్టాటాస్టిక్ అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, ఏ.ఓ శ్రీనివాస్, అందరూ తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ట్.పి.ఓ లు., ఏ.ఎస్.ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post