2021-22 ఆర్ధిక సంవత్సరానికి నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ పథకాల కింద 4226 కోట్ల రూపాయల రుణాలకు లక్ష్యంగా కార్యాచరణ ప్రణాలికలు ఆమోదించిన జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటి.

నాగర్ కర్నూల్ జిల్లా
2021-22 ఆర్ధిక సంవత్సరానికి నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ పథకాల కింద 4226 కోట్ల రూపాయల రుణాలకు లక్ష్యంగా కార్యాచరణ ప్రణాలికలు ఆమోదించిన జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటి.
నాగర్ కర్నూల్ జిల్లాలో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి 4226 కోట్ల రూపాయల రుణాలను వివిధ పథకాల ద్వారా బ్యాంకు ఖాతా దారులకు ఇచ్చేందుకు లక్షంగా నిర్దేశించుకున్నట్లు జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ ప్రకటించారు. మంగళవారం ఉదయము కలేక్టరాట్ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సంప్రదింపుల కమిటికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించగా జడ్పి చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, జడ్పిటిసిలు, నాబార్డ్, ఆర్.బి.ఐ. అధికారులు జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో కోవిడ్ పరిస్థుతులు నేలకోన్నపటికి బ్యాంకర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నెరవెర్చారని కొనియాడారు. అయితే వ్యవసాయ, వ్యాపార, నిరుద్యోగులకు రుణాలు అందించడం వంటి రంగాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు రుణాలు అందించలేకపోయమని పేర్కొన్నారు. వచ్చే ఈ ఆర్థిక సంవత్సరంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, బ్యాంకర్లు అందరు భాగస్వాములై నిర్దేశించుకున్న లక్ష్యానికి అధికంగా సాధించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న వివిధ పతకాలను జిల్లాలో అర్హులందరికీ చేరే విధంగా మండలాలు, బ్రాంచుల వారిగా లక్ష్యాలను నిర్దేశించి అన్ని బ్రాంచులు వాటికీ ఇచ్చిన లక్ష్యాలను సాధించే విధంగా మార్గనిర్దేశం చేయాలనీ లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు.
సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిషద్ చైర్మన్ పి. పద్మావతి మాట్లాడుతూ కొన్ని బ్యాంకులలో బాగానే పని చేస్తున్నపటికి కొన్ని బ్యాంకులలో మేనేజర్లు సరిగా పనిచేయడం లేదని అన్నారు. వచ్చిన ఖాతా దారులపై విసుగ్గోకుండా వారికీ ఋణం తీసుకోడానికి అర్హుల కాదా, ఎంద్కుకు అర్హత కాదు ఎ ఋణం తీసుకోడానికి అర్హుడు అనే అంశాలు విడమరచి చెప్పాలని బ్యాంకర్లను కోరారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న రైతుబందు, పించన్లు వంటివి బ్యాంకులో డబ్బు జమ అయిన వెంటనే రుణాల కోతలు విధించి లబ్దిదారులకు అన్యాయం చేయవద్దని తెలియజేసారు. సంక్షేమ శాఖల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ రహిత రుణాలను అర్హత ఉన్న ప్రతి వ్యక్తికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాన్కర్లను సూచించారు.
నాబార్డ్ డి.డి.యం నాగార్జున మాట్లాడుతూ వ్యవసాయ పరంగా ఎంతో అభివృద్ధి సాధించిన నాగర్ కర్నూల్ జిల్లాలో మౌలిక సదుపాయాలు అయిన వ్యవసాయ గోదాములు, ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు చాల అవకాశం ఉందని ఇలాంటివాటిని నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన వారిని రుణాలు అందించాల్సిందిగా బ్యాన్కర్లను సూచించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశ పెడుతున్న పథకాలను క్షేత్ర స్థాయిలో ఉన్న అర్హులకు అందించే విధంగా మండల స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఆర్.బి.ఐ యల్.డి.ఓ సాయిచరణ్ మాట్లాడుతూ మండల స్థాయిలో బి.యల్. ఆర్.సి. సమావేశాలను తరచుగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పతకాలను ప్రజాప్రతినిధుల ద్వార లబ్దిదారులకు అందే విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించి మొండి బకాయిలు లేకుండా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను లబ్దిదారులకు అందే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు.
లీడ్ బ్యాంక్ మేనేజర్ సురేష్ కుమార్ గత ఆర్ధిక సంవత్సరంలో ఎ ఎ రంగాల్లో ఎంతవరకు రుణాలు అందించారో వివరాలు తెలిపారు. జిల్లాలో 15 బ్యాంకులు 77 బ్రాంచిలను కలిగి ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ రుణాలు 57.83 శాతం ఇవ్వడం జరిగిందన్నారు. 8648 స్వయం సహాయక సంఘాలకు 257 కోట్ల రూపాయలు రుణాలుగా అందించడం జరిగిందన్నారు. యం.యస్.యం.ఇ., ముద్రా రుణాలు, వీదివ్యపారులకు రుణాలు వంద శాతం ఇచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసారు.
సమావేశంలో పాల్గొన్న కల్వకుర్తి జడ్పిటిసిలు భరత్ కుమార్, అచంపేట్ జడ్పిటిసి మంతియ నాయక్ బ్యాంకర్ల పనితీరుపై తమ అసంతృప్తిని తెలియజేసారు. బ్యాంకులలో అర్హులకు రుణాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని, అదేవిధంగా సరియైన అవగాహన కల్పించడం లేదని పేర్కొన్నారు. ఇకనైనా మండల ప్రజా ప్రతినిధులకు వివిదః పథకాలపై అవగాహన కల్పించి క్షేత్ర స్థాయిలో వంద శాతం అమలు అయ్యే విధంగా చూడాలన్నారు.
ఈ సమావేశంలో బ్యాంకర్లు, జిల్లా వ్య్వవసాయ అధికారి వెంకటేశ్వర్లు, పిడి డి.ఆర్.డి.ఎ. నర్సింగ్ రావు ఇతర జిల్లా అధికారులు, జడ్పిటి సి లు తదితరులు పాల్గొన్నారు.
————————

Share This Post