2021-22 వరి దాన్యం కొనుగోళ్లు విజయవంతంగా నిర్వహించాలి, వరి దాన్యం కొనుగోళ్ల పై సెంటర్ల ఇంచార్జ్ లకు శిక్షణ కార్యక్రమం : జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు

ప్రచురణార్థం

తేదీ.30.10.2021

ధాన్యం కోనుగొలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోళ్ల నిర్వహణలో ముఖ్యపాత్ర వానాకాలం 2021-22 వరి దాన్యం కొనుగోళ్ల పై సెంటర్ ల ఇంచార్జ్ లకు శిక్షణ కార్యక్రనం

నల్గొండ,అక్టొబర్ 30:- జిల్లాలో వానాకాలం 2021-22 వరి దాన్యం కొనుగోలులో సెంటర్ ఇంచార్జి లు ముఖ్య పాత్ర వహిస్తారని,ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ కొనుగోళ్లు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు.దాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన దృష్ట్యా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణా కార్యక్రమం శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో నిర్వహించారు.ఈ శిక్షణలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత వానాకాలంలో 4,46,085 ఎకరాలలో వరి సాగు జరిగిందని,11,03,421 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని,కొనుగోలు కేంద్రాలకు 5,43,680 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా అని, కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా పనిచేయాలని అన్ని శాఖల అధికారులను,సిబ్బందిని కోరారు. జిల్లాలో 184 దాన్యం కొనుగొలు కేంద్రాల ఏర్పాటు కు చర్యలు తీసుకున్నట్లు,ఐ. కె.పి ద్వారా 93,పి.ఏ.సి.ఎస్.ద్వారా 84 ,వ్యవసాయ మార్కెట్ కమిటీ ల ద్వారా 7 కేంద్రాలు 184 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

ధాన్యం కోనుగోలు చేసే సమయంలో నాణ్యత పై కఠినంగా వ్యవహరించాలని, నాణ్యత ప్రమాణాల అంశం పై వ్యవసాయ విస్తరణ అధికారులు, సెంటర్ ఇంచార్జిలు భాద్యత వహించాలని, అన్నారు. వానాకాలం ధాన్యం కోనుగోలు కోసం జిల్లాలో అవసరమైన టార్ఫాలిన్ కవర్లు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ధాన్యం శుద్ది యంత్రాలు, తేమ శాతం కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

జిల్లాలో ఉన్న ప్యాడీ క్లీనర్లను మేజర్ సెంటర్లకు కేటాయించాలని, అనంతరం ప్రతి ధాన్యం కోనుగోలు కేంద్రం వద్ద తప్పని సరిగా ప్యాడీ క్లీనర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ తొలగించే అంశం, తాలు నిర్మూలించడానకి ప్యాడీ క్లీనర్ల వినియోగం తదితర అంశాల పై వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.

రైతులు ధాన్యం కోత అనంతరం వాటిని ఆరబెట్టుకొని, 17% లోపు తేమ,వ్యర్థ పదార్థాలు(మట్టిరాళ్లు,గడ్డలు 1% లోపు,ఇతర గింజలు 1%లోపు,పక్వానికి రాని, దెబ్బ తిన్న,రంగు మారిన దాన్యం, 3% , పురుగు తిన్న, రంగు మారిన ధాన్యం, 3% ,మొలకెత్తినవి,పురుగులు పడ్డవి, మిశ్రమ,తక్కువ రకం దాన్యం 5% ఉండే విధంగా తయారు చేసి కోనుగోలు కేంద్రాలకు తీసుకోని రావాలని ,ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్కు 1960 రూ.లు,సాధారణ రకానికి 1940 రూ.లు మద్దతు ధర పొందాలని అన్నారు. పెరిగిన మద్దతు ధర పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ధాన్యం కోనుగొలుకు అవసరమైన గన్ని బ్యాగులు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలని, అదే విధంగా ధాన్యం రవాణా అంశంలో సమస్య ఉత్పన్నం సెంటర్ ఇంఛార్జీలు, మిల్లర్ లు,రవాణా కాంట్రాక్టర్లు పని చేయాలని అన్నారు..ఈ ధాన్యం కోనుగోలు విషయంలో ఏమైనా సమస్యలు, ఫిర్యాదుల కై టోల్ ఫ్రీ నెంబర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల సమయంలో సంప్రదించ వచ్చని తెలియచేసారు.

కోనుగొలు కేంద్రాలలో కొనుగోలు చేసిన దాన్యం మ్యాపింగ్ చేసిన మిల్లులకు పంపించాలని అన్నారు. ధాన్యం కోనుగొలు కేంద్రాలో కనీస మౌలిక వసతులు మూత్రశాలలు, మంచి నీరు, సబ్బులు ఏర్పాటు చేయాలని, కోవిడ్ 19 దృష్ట్యా మాస్కు ధరించడం, సానిటైజర్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కోనుగొలు కేంద్రాలో విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖను కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కోనుగొలు కేంద్రం మరియు రైస్ మిల్లుల వద్ద హమాలీలు అందుబాటులొ ఉండేలా చర్యలు తీసుకోవాలని, సకాలంలో లోడింగ్ అన్ లోడింగ్ ప్రక్రియ జరగాలని అన్నారు.

జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ నాగేశ్వర్ రావు , జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాళిందిని , జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్ , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ ,డి.సి.ఓ.,ప్రసాద్,జిల్లా రవాణా అధికారి సురేష్ రెడ్డి, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం, ప్రతినిధులు సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

Share This Post