2022 జనవరి-1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి – జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్ధం

2022 జనవరి-1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి – జిల్లా కలెక్టర్ శశాంక

మహబూబాబాద్, 2021 నవంబర్-05:

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు విధిగా ఓటు హక్కు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.  ఓటరుగ తమ పేర్లను నమోదు చేసుకొనుటకు, ఓటరు జాబితలో పేర్లను తొలగించుట, సవరణ, ఓటు హక్కు ఒక పోలింగ్ స్టేషన్ నుండి మరొక పోలింగ్ స్టేషన్ కు మార్చుకొనుటకు తమ దరఖాస్తులను ఈ నెల 6, 7 తేదిలలో ఉదయం 10 గంటల నుండి సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద గల బూత్ లెవెల్ అధికారికి ఇవ్వాలని, అలాగే ఆన్ లైన్ లో కూడా ఈ సేవలను పొందవచ్చని తెలిపారు.

2022 జనవరి-1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందుటకు అర్హులని, దరఖాస్తుతో వయస్సు నిర్ధారణ ధృవపత్రం జతపరిచి ఫారం-6 అందజేయాలన్నారు.  చనిపోయిన వారి పేరు ఓటరు జాబితాలో ఉన్నట్లయితే, ఒక ఓటరు పేరు రెండు సార్లు ఉన్నచో, గ్రామం విడిచి వెఌన వారి వివరాలను సరైన ఆధారాలతో ఫారం-7 పూరించి వారి పేర్లను తొలగించుటకు దరఖాస్తు చేయాలన్నారు.  అలాగే, ఓటరు జాబితాలో పేరు, చిరునామా, వయస్సు వంటివి సవరించుటకు సరైన ఆధారలతో ఫారం-8 పూరించి సమర్పించాలన్నారు. ఓటు హక్కును ఒక పోలింగ్ కేంద్రం నుండి  అదే నియోజకవర్గంలో గల వేరొక పోలింగ్ కేంద్రానికి మార్చుటకు సరైన ఆధారాలతో ఫారం నెంబర్-8ఏ ద్వారా మార్చుకోవచ్చునని తెలిపారు.

ఓటు హక్కు అర్హత కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నెల 6, 7 తేదీలలో ఉదయం 10 గంటల నుండి సంబంధిత పోలింగ్ కేంద్రాల్లొ ఉన్న బి.ఎల్.ఓల వద్ద కాని ఆన్ లైన్ లో గాని దరఖాస్తు చేయాలని కోరారు.
————————————————————————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post