2022 ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర ఏర్పాట్లు త్వరిత గతిన పూర్తి చేయాలి ::గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్

వార్త ప్రచురణ
ములుగు జిల్లా
తేదీ:01-12-2021,
మేడారం జాతరలో భక్తులకు మెచ్చేలా శాశ్వతమైన ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని జిల్లా అధికారులను తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు
బుధవారం ములుగు జిల్లా మేడారం జాతర ఏర్పాట్లు పరిశీలన, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్ ,స్థానిక శాసనసభ్యులు ధనసరి అనసూయ,జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి , వివిధ ప్రజా ప్రతినిధులతో కలిసి సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు.

2022 ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో భక్తులకు వసతుల కల్పన, జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు కావల్సిన స్నానఘట్టాలు, దుస్తుల మార్పిడి గదులు, ప్రమాదాలు సంభవించకుండా తీసుకుంటున్న చర్యలు, భక్తుల వసతి సౌకర్యాలపై మేడారం ప్రాంతమంతా తిరిగి పర్యవేక్షించారు.అనంతరం అక్కడ జరుగుతున్న పనులపై స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, నేతలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన ఆరాధ్య దైవం ఐన సమక్క సారలమ్మ జారత గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా భక్తులకు సకల సౌకర్యాలు కలిపించి తెలంగాణాన రాష్ట్ర ముఖ్యమత్రి గారు కల్వకుంట్ల చoద్ర శేఖర్ రావు గారి ఆదేశాతో జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని వారు అన్నరు. గత ప్రభుత్వాలను పోలిస్తే తెలంగాణాన రాష్ట్రము వచ్చాక శాశ్వత ప్రా తిపాదికన బడ్జెట్ కేటాయించడం జరిగిందని వారు అన్నారు .హెల్త్ డిపార్ట్మెంట్ వారి సేవలు చాల ముఖ్యం అని,భక్తులు ప్రతి ఒక్కరు మాస్క్ దరించి జాతరకు రావలసినదిగా అవగాహనా కల్పాయించాలని అన్నారు. గత జాతరలలో అన్ని ఏర్పాట్లు బాగా చేసినప్పటికీ ఎలక్ట్రిసిటీ వైరి తెగి ఒక్క ప్రమాదం సభవిన్చిందని , గత అనుభవాలను దృస్టిలో పెట్టుకుని విధ్యత్ ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆర్టిసి వారు ప్రజల సౌకర్యార్ధం రవాణ సౌకర్యాలు కాల్పించాలని అన్నారు.

ఈ సందర్భంగా ములుగు జిల్లా శాసన సభ్యులు రాలు దనసరి అనసూయ(సీతక్క) మాట్లాడుతూ మేడారం జాతర పనులలో క్వాలిటీ ప్రమాణాలను పాటించాలని అన్నారు. కోవిడ్ నిభందనలు పాటిస్తూ , మెడికల్ అధికారులు అవేర్నెస్ కల్పించాలని , మాస్క్ తప్పని సరి అని భక్తులకు అవగాహన కల్పించాలని అన్నారు.జాతర వరకు రోడ్లను పూర్తి చేయాలని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు పసుపు కుంకుమ బంగారాన్ని ప్రసాదంగా ఇవ్వాలని అన్నారు. అందరం కలిసి కట్టుగా జాతరను విజయవంతం చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రతి పైసా మనదని, పనులు నాణ్యతగా చేపట్టాలి అనిబాన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మేడారం జాతర పనులు శాశ్వత పనులు చేపట్టాలి అని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాలు పాటిస్తూ, జనవరి మొదటి వారంలోగా పనులు పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమలో జిల్లాపరిషత్ వైస్ చైర్మెన్ బడే నాగజ్యోతి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ మెంబర్స్ రియాజ్,వలియబి , రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ పళ్ళ బుచ్చయ్య, ఆత్మ చైర్మన్ దుర్గంరమణయ్య , మేడారం గ్రామ సర్పంచ్ బాబురావు, ట్రైబల్ వెల్ఫేర్ సిఈ శంకర్, ఈవో రాజేందర్, ఆర్ అండ్ బి ఎస్సీ నాగేందర్ రావు, ఈ ఈ వెంకటేష్, పంచాయతీరాజ్ ఎస్సీ ఈ జోగా రెడ్డి, ఆర్ డబుల్ ఎస్ ఎస్.ఇ రామచంద్రం, ఇరిగేషన్ ఎస్.ఇ వెంకటేశ్వర్లు, ఐటీడీఏ ఎపీవో వసంతరావు ,ఇ.ఇ.హేమలత, తాడ్వాయి తాసిల్దార్ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post