ప్రచురణార్ధం
భద్రాద్రి కొత్తగూడెం::- సెప్టెంబర్ 18, 2021.
2022 ఓటరు జాబితా రూపకల్పన, 2022 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు నూతన ఓటరుగా నమోదు కావడం, ఎన్నికల గుర్తింపు కార్డులు జారీ, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులుకు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు చేయుట తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులలో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు తదితర అంశాలపై జిల్లా, మండలస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని చెప్పారు. ఈవియం గోదాముల తనిఖీ చేసిన నివేదికలను ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపాలని చెప్పారు.
ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యతననుసరించి తప్పులు లేని ఆరోగ్యవంతమైన ఓటరు జాబితాను తయారు చేయు విదంగా కృషి చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు. నూతనంగా ఓటుహక్కు పొందిన ప్రతి ఒక్కరు యన్విఎస్పీ. ఇన్ పోర్టల్ ద్వారా ఎన్నికల గుర్తింపు కార్డులను (ఎపిక్ కార్డును) డౌన్లోడ్ చేసుకోవడానికి పోలింగ్ కేంద్రాల వారిగా బూతు స్థాయి అధికారులు ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగింపుపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఏజెంట్లును నియమించుకోవాలని చెప్పారు. పోలింగ్ కేంద్రం పరిధిలోని బూతుస్థాయి అధికారులు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ఓటరు జాబితాను చదివి వినిపించు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓటరు జాబితాలో పేరు తప్పుగా నమోదైనా, పేర్లు సరిగా లేకపోయినా ఫారం 8లో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన ఓటర్లకు సూచించారు. మరణించిన, వలసవెళ్లిన, పెండ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి జాబితాను పరిశీలన చేసి ఓటరు జాబితాలో పేర్లు తొలగించేందుకు ముందస్తుగా నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. పెండింగ్ ఉన్న ఫారం 6, 6ఏ, 7,8 మరియు 8 ఏ లను సత్వరమే పరిష్కరించు విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డూప్లికేట్ ఎపిక్ కార్డు కొరకు ఫారం 001లో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, ఏఓ గన్యా, ఎన్నికల విభాగం సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.