2022-2024 సంవత్సరములకు గానూ అక్రిడిటేషన్ల జారీకి పాత్రికేయుల నుండి దరఖాస్తులు ఆహ్వానం, అర్హులైన పాత్రికేయులు 25-05-2022 నుండి ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి.

2022-2024 సంవత్సరములకు గానూ అక్రిడిటేషన్ల జారీకి పాత్రికేయుల నుండి దరఖాస్తులు ఆహ్వానం, అర్హులైన పాత్రికేయులు 25-05-2022 నుండి ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి.

2019 సంవత్సరంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు జూన్ 30వ తేదీ నాటికి ముగుస్తున్నందున కొత్తగా అక్రిడిటేషన్ కార్డుల జారీకి అర్హులైన జర్నలిస్టుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. జిల్లాలోని జర్నలిస్టులు సమాచార శాఖ ఆన్ లైన్ వెబ్ సైట్ https:/ipr.telangana.gov.in/ ను సందర్శించి మెనూ క్రింద చూపించే Media Accreditation లింక్ ను క్లిక్ చేసి జర్నలిస్ట్ లకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలి. ఆన్ లైన్ అప్లికేషన్ ఫారంలో అడిగిన ఫోటోలను, డాక్యుమెంట్ (RNI Certificate, Management Letter, Study Certificate, CA Certificate, ABC Certificate) లను జత చేయాలి. ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణకు జూన్ 4 వ తేదీ తుది గడువు అని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలోని అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానికి మీడియా జర్నలిస్ట్ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Share This Post