2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 2334.63 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి.

2022-23  ఆర్థిక సంవత్సరానికి రూ. 2334.63 కోట్లతో  వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి.

మంగళవారం ఉదయం నాబార్డ్ రూపొందించిన  2022-23 సంవత్సరానికి నారాయణపేట జిల్లా వార్షిక ఋణ ప్రణాళిక పుస్తకాన్ని కలెక్టర్ తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.  ఈ రుణ ప్రణాళికలో వ్యవసాయానికి రూ. 2184.35 కోట్లు ఋణంగా ఇవ్వడం జరుగుతుందన్నారు.   సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు  రూ. 119.41 కోట్లు, విద్య రుణాలకు రూ. 4.76 కోట్లు , గృహానిర్మాణానికి  రూ. 9.52 కోట్లు ఇతర సామాజిక మౌళిక రంగానికి 16.58 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.   ఈ రుణ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలోని బ్యాంకులు  తమకు కేటాయించిన రుణ లక్ష్యాలను కేటాయింపులు చేయాలని బ్యాంకులను కోరారు.  ఈ కార్యక్రమంలో నాబార్డు జిల్లా అధికారి నాగార్జున, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసన్న కుమార్ , డి.పి.ఆర్.ఓ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Share This Post