2022-23 వ విద్యా సంవత్సరమునకు గాను కార్పొరేట్ కళాశాలలో చేరడానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి గడువు తేది 26-07-2022 వరకు పొడిగిపు

ప్రచురణార్దా౦—-3

తేది. 20.07.2022

2022-23 వ విద్యా సంవత్సరమునకు గాను కార్పొరేట్ కళాశాలలో చేరడానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి గడువు తేది 26-07-2022 వరకు పొడిగిపు

జగిత్యాల , జూలై 20: 2022-23 వ విద్యా సంవత్సరమునకు గాను : అర్హులైన SC / ST / BC / EBC / Disabled / Minority విద్యార్ధులచే కార్పొరేట్ కాలేజీలల్లో అడ్మిషన్లకై ఆన్లైన్ లో ధరఖాస్తులు చేసుకోవడానికి గడువు పొడగించడం జరిగింది . మార్చి – 2022 వ సం. లో 10 వ తరగతి నందు 7.0 జి.పి.ఎ ఆపై గ్రేడ్ పొందిన విద్యార్ధులు మాత్రమే అర్హులు . ప్రభుత్వ సంక్షేమ వసతి గృహములు / ఆశ్రమ పాఠశాలలు / కస్తూరిబా పాఠశాలలు మరియు ప్రభుత్వ మున్సిపల్ , జిల్లా పరిషత్ మరియు ఏయిడెడ్ పాఠశాలలో చదివిన విద్యార్థులు ( డే స్కాలర్ ) మరియు ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ , జవహర్ నవోదయ విద్యాలయముల విద్యార్థులు మరియు టెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకము: క్రింద చదివిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చును. ఈట్టి సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరు.
2022-23 విద్యా సంవత్సరమునకు గాను కార్పొరేట్ కాలేజీలల్లో ప్రవేశము కొరకు తేది : -20-07-2022 నుండి 26-07-2022 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొనుటకు గడువు పొడగించడం జరిగినది.
ధరఖాస్తులు చేసుకొనే విద్యార్థులు తేది : 20-07-2022 నుండి 26-07-2022 వరకు Epass website ద్వారా ( http://telanganaepass.cgg.gov.in ) నందు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చును . మరియు ధరఖాస్తుతో పాటుగా ఈ క్రింద తెలిపిన సర్టిఫికెట్లను జాతచేయవలెను .
1. 10 వ తరగతి పాస్ మెమో
2. కులం ఆదాయము సర్టిఫికెట్స్ మీ సేవ ద్వారా పొందినది .
3. బ్యాంక్ పాస్ బుక్
4. ఆధార్ కార్డు నెంబర్
5. రేషన్ కార్డు నంబర్ వివరములు
6. పాస్ పోర్ట్ సీటీ ఫోటో
7. విద్యార్థులు స్టడీ జాతపరచవలెను సర్టిఫికెట్స్ ( 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ) ఏడు
సంవత్సరములవి జతపరచవలెను.
8. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహములలో చదివనటువంటి విద్యార్థులు సంబందిత వసతి గృహ సంక్షేమ అధికారిచే (03) సం ల కు సంబందించిన బోనఫైడ్ సర్టిఫికెట్స్ తీసుకొని అట్టి దానిపై సహాయ సంక్షేమ అధికారిచే దృవీకరించి జాతపరచవలెను .

ఆన్లైన్ లో ఈ పాస్ వెబ్ సైటు నందు దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థులు ప్రాధాన్యత క్రమములో ( 03 ) కళాశాలను ఎంపిక చేసుకోవలెను . దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ పాస్ సిస్టమ్ ద్వారా విద్యార్థుల ఎంపిక ఆటోమేటిక్ గా జరుగును . మరియు కళాశాలలు కూడా అలాట్ చేయబడును .

జిల్లా పౌరస౦బంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.

Share This Post