2022 -24 సంవత్సరాలకు అక్రిడేషన్ కార్డు జారీకి దరఖాస్తుల ఆహ్వానం- కలెక్టర్ హరీష్

2022-2024 సంవత్సరానికి గాను అక్రిడిటేషన్ ల జారీకి పాత్రికేయుల నుండి దరఖాస్తులు ఆహ్వానం
– అర్హులైన పాత్రికేయులు ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి
– జూన్ 4 వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు

సమాచార పౌర సంబంధాల శాఖ ఆదేశాల మేరకు 2022-24 సంవత్సరానికి గాను రెండేండ్ల కాలవ్యవధి కాలానికి అక్రిడిటేషన్ కార్డు ల జారీకి పాత్రికేయుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019 సంవత్సరంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డు ల గడువు జూన్ 30 వ తేదీ నాటికి ముగుస్తున్న దృష్ట్యా కొత్త గా అక్రిడిటేషన్ కార్డు ల జారీకి జిల్లాలో అర్హులైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులు సమాచారశాఖ ఆన్లైన్ వెబ్ సైట్ https:/ipr.telangana.gov.in/ ను సందర్శించి మెనూ క్రింద చూపించే Media Accreditation లింక్ ను క్లిక్ చేసి జర్నలిస్ట్ లకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫారం లో అడిగిన సమాచారాన్ని భర్తీ చేస్తూ ఫోటోలను, డాక్యుమెంట్ లను జత చేయాలన్నారు. ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ కు జూన్ 4 వ తేదీ తుది గడువు అని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన ప్రతితో పాటు జతపరచిన ప్రతులను విధిగా జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయములో అందజేయవలసినదిగా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 239 అనుసరించి కమిటీ ఆమోదం మేరకు అర్హులైన రిపోర్టర్లకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కలెక్టర్ తెలిపారు.

Share This Post