2022-24 సం.నికి కొత్త అక్రెడిటేషన్ కార్డుల దరఖాస్తుకు జూన్ 4 వ. తేది చివరి తేది : జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.ఎ. రషీద్

పత్రికా ప్రకటన.   తేది:24.05.2022, వనపర్తి.

సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు 2022-24 సం.నికి గాను కొత్త అక్రెడిటేషన్ కార్డుల ప్రక్రియ జారి చేస్తున్నట్లు, జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయుటకు తేది:25.05.2022 నుండి 04.06.2022వ. తేది లోపు ఆన్ లైన్ వెబ్ సైట్ లింక్ ipr.telangana.gov.in/ts-media-accreditation-cards-2022 ద్వారా సంబంధిత ధృవపత్రాలతో దరఖాస్తు చేసుకోగలరని జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.ఎ. రషీద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆన్లైన్ దరఖాస్తు ఫారము, జత చేసిన కాపీలను  విధిగా జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి కార్యాలయములో అందజేయాలని సూచించారు. జి.ఓ. నెం. 239 ను అనుసరించి, అక్రెడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్, జిల్లా అక్రెడిటేషన్ కమిటి చైర్మన్ ద్వారా అర్హులైన రిపోర్టర్లకు మంజూరు చేయడం జరుగుతుందని సూచించారు.
………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post