Month: June 2022

హన్మకొండ జిల్లా 8-6-2022 వడ్డెపల్లి పింగళి మహిళా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఇంటర్ డిసిప్లినరీ నేషనల్ కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో మంత్రి సత్యావతి రాథోడ్, ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కూడా చైర్మన్ సుందర్ రాజ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు

హన్మకొండ జిల్లా 8-6-2022 వడ్డెపల్లి పింగళి మహిళా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఇంటర్ డిసిప్లినరీ నేషనల్ కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో మంత్రి సత్యావతి రాథోడ్, ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కూడా చైర్మన్ సుందర్ రాజ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. మంత్రి సత్యావతి రాథోడ్ కామెంట్స్ మహిళలు సమాజంలో గౌరవంగా జీవించేలా తీర్చి దిద్దుతున్న కళాశాల అధ్యాపక, ప్రిన్సిపాల్ కి అభినందనలు పింగిలి కళాశాలకు చరిత్రాత్మక గుర్తింపు ఉంది మహిళలు విధానపరమైన…

పత్రికా ప్రకటన తేది:8.6.2022, వనపర్తి. వనపర్తి జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు జాప్యం లేకుండా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశించారు బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి, వివిధ సంక్షేమ పథకాలపై జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22న కేంద్ర జల శక్తి అభియాన్ బృందం జిల్లాలో పర్యటిస్తున్నదని…

పత్రికా ప్రకటన.   తేది:08.06.2022, వనపర్తి. గ్రామీణ అభివృద్ధి సాధించేందుకు వివిధ పథకాలకు సకాలంలో నిధుల రూపంలో రుణాలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి బ్యాంక్ అధికారులకు ఆదేశించారు. బుధవారం దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆజాదిక అమృత మహోత్సవం వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కస్టమర్ అవుట్ రీచ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షేక్…

టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కోర్ ఏరియాలో నివసిస్తున్న కుడిచింతల బైలు గ్రామస్థులు స్వచ్చందంగా పునరావాసం కోరుకునే వారిని పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు

టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కోర్ ఏరియాలో నివసిస్తున్న కుడిచింతల బైలు గ్రామస్థులు స్వచ్చందంగా పునరావాసం కోరుకునే వారిని పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.  బుధవారం ఉదయం   సార్లపల్లి, కుడిచింతల బైలు గ్రామాన్ని అటవీ శాఖ, పి.ఓ ఐ.టి.డి.ఏ, రెవెన్యూ అధికారులతో కలిసి పునరావాసానికి సంబంధించి  అక్కడి ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.  జాతీయ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సూచనల మేరకు అక్కడ నివసించే చెంచులు, చెంచుయేతరులను పునరావాసం…

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక పూర్తి – అదనపు కలెక్టర్ మను చౌదరి

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక పూర్తి – అదనపు కలెక్టర్ మను చౌదరి షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 8  బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 1వ. తరగతి, 5వ. తరగతులలో ప్రవేశానికి బుధవారం నాగర్ కర్నూలు పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ భవనం లో అదనపు కలెక్టర్ మను చౌదరి లక్కీ డిప్ ద్వారా సీట్లను ఎంపిక చేశారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివేందుకు 1 తరగతికి 78 మంది…

మేకలు, గొర్రెలలో వచ్చే నట్టల నివారణ వ్యాధి నిర్మూలన కోసం టీకా మందులను వేయించాలని బాల్రాజ్ యాదవ్  అన్నారు

మేకలు, గొర్రెలలో వచ్చే నట్టల నివారణ వ్యాధి నిర్మూలన కోసం టీకా మందులను వేయించాలని బాల్రాజ్ యాదవ్  అన్నారు. బుధవారం నారాయణపేట మండలంలోని బోయినపల్లి  గ్రామాల్లో మేకల, గొర్రెల నట్టల నివారణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  బాల్రాజ్  తెలంగాణా గొర్రెల మేకల అభిరుద్ది సహకార సమైక్య చైర్మన్ మాట్లాడుతూ మేకలు, గొర్రెలు పెంపకం చేసే కాపలదారులు తప్పకుం డా వాటికి వ్యాధి నిరోధక టీకాలను వేయించాలన్నారు. అదే విధంగా పశువులకు ఎలాంటి వ్యాధులు వ్యాపించిన…

తాండూర్ రాజీవ్ స్వగృహ సమీపంలోగల మనోహ టౌన్షిప్ ఫ్లాట్ లను జూన్ 14న వేలం వేయనున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ తెలిపారు. బుధవారం తాండూరు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ప్లాట్ల వేలంపై సంబంధిత అధికారులతో కలిసి వేలంపాటలో పాల్గొనడానికి ఆసక్తి చూపే వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాండూరు-హైదరాబాద్ రహదారికి దగ్గరలో ఉన్న యాలల మండలం కోకట్ గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 52 నందు దు మోహ…

DPRO ADB- పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున ఇచ్చోడ మండలం దుబార్ పేట్, మాదాపూర్ గ్రామపంచాయితీలలో పర్యటించి ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాలలో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత దుబార్ పేట్ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు, అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మరిన్ని మొక్కలను నాటి చిట్టడివి లాగా వనాన్ని తయారు చేయాలనీ సర్పంచ్ కు సూచించారు. దుబార్ పేట్ లో…

DPRO ADB-ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టెట్ పరీక్ష నిర్వహణ, ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 12న (ఆదివారం) నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష కు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పేపర్-1 పరీక్ష నిర్వహణకు 33 కేంద్రాలు, పేపర్-2 పరీక్ష నిర్వహణకు 15 కేంద్రాలు…