Day: August 25, 2022

ప్రచురణార్ధం ఆగష్టు 25 ఖమ్మం పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలని, ప్రజలందరూ స్వచ్చంధంగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విధంగా ఉత్సవ కమిటీలు ప్రజలను చైతన్యపర్చి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఈ నెల 31న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనపు ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, సంబ్రాధి ఉత్సవ కమిటీ బాధ్యులతో ఏర్పాటు చేసిన…

రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0      జిల్లాలో ప్రధాన రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో హారితహారంలో భాగంగా అటవీ, గ్రామీణాభివృద్ది, హెచ్.కె.ఆర్ సిబ్బంది, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలతో హరితహారం జిల్లా కలెక్టర్ సమక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రవేశం మొదలు, ప్రధాన రోడ్లవెంట మొక్కలను…

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి, ఉన్నత లక్ష్యాలతో రాణించాలి – జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి. రాజేష్ బాబు

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి, ఉన్నత లక్ష్యాలతో రాణించాలి – జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి. రాజేష్ బాబు   విద్యార్థులు పట్టుదలతో చదివి చదువుల్లో రాణించాలని నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన ప్రిన్సిపల్ న్యాయమూర్తి డి. రాజేష్ బాబు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని గీతాంజలి జూనియర్ కళాశాలలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ప్రాథమిక చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సును …

జిల్లాలోని 16 మండలాలలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో భాగంగా 164 గ్రామపంచాయతీలను ఓ.డి.ఎఫ్‌. ప్లస్‌ గ్రామపంచాయతీలుగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్‌, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రితో కలిసి ఆదర్శ గ్రామాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా…

మెడికల్ కళాశాలకు భూములు అందించిన రైతులు చర్చలకు హాజరు కావాలి అదనపు కలెక్టర్ మోతిలాల్

మెడికల్ కళాశాలకు భూములు అందించిన రైతులు చర్చలకు హాజరు కావాలి అదనపు కలెక్టర్ మోతిలాల్   నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తమ భూములను అందించిన 30 మంది రైతులతో చర్చించేందుకు ఈనెల 23వ, 25వ తేదీల్లో ఆహ్వానించినప్పటికీ చర్చలకు హాజరు కావడం లేదని నాగర్ కర్నూల్ జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్ పేర్కొన్నారు. గురువారం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, నాగర్ కర్నూల్ ఆర్ డి ఓ, ఆర్ అండ్ బి ఈ,…

జీవన చరమాంకంలో ఉంటూ, అయినవారి నుండి నిరాదరణకు గురైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు అందించాలి – రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు శ్వేతా మహంతి

జీవన చరమాంకంలో ఉంటూ, అయినవారి నుండి నిరాదరణకు గురైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు అందించాలి – రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు శ్వేతా మహంతి   దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ, జీవన చరమాంకంలో ఉండి ఐన వారి నుండి నిరాదరణకు గురియైన  వారికి పాలియేటివ్ కేర్ కేంద్రం ద్వారా మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి వైద్యులను ఆదేశించారు. గురువారం సాయంత్రం…

నూతన ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ విషయమై గురువారం అయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలతో పాటు, మహబూబ్ నగర్ జిల్లాకు కూడా కొత్తగా ఆసరా పెన్షన్లను మంజూరు చేసిందని ,తక్షణమే ఈ పెన్షన్ కార్డులను పంపిణీ చేసేందుకు పక్కగా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆమోదంతో పెన్షన్ కార్డుల పంపిణీకి షెడ్యూల్ రూపొందించాలని,అలాగే సంబంధిత శాసనసభ్యులకు ముందుగా సమాచారాన్ని తెలియజేసి షెడ్యూల్…

గర్భిణీలు రక్తహీనత సమస్యను ఆదిలోనే గుర్తించి డెలివరీ అయ్యే సమయానికి సుఖప్రసవం అయ్యే విధంగా ఏ.ఎన్. యంలు ఆశా వర్కర్ల తో పాటు మెడికల్ ఆఫీసర్లు పకడ్బందీగా బర్త్ ప్లాన్ చేయాలని రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి ఆదేశించారు

గర్భిణీలు రక్తహీనత సమస్యను ఆదిలోనే గుర్తించి డెలివరీ అయ్యే సమయానికి సుఖప్రసవం అయ్యే విధంగా ఏ.ఎన్. యంలు ఆశా వర్కర్ల తో పాటు మెడికల్ ఆఫీసర్లు పకడ్బందీగా బర్త్ ప్లాన్ చేయాలని రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి ఆదేశించారు.  గురువారం అచ్ఛంపేటలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి అచ్ఛంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అందరూ ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. 8 నుండి…

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో విజేతలైన ఫోటోగ్రాఫర్లకు అవార్డుల ప్రధానోత్సవం నేడు హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, మీడియా అకాడమీ…

ITDA UTNR: భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలకు ఎస్.బి.ఐ శాఖ చేయూతనందించడం అభినందనీయం: ఐటిడిఏ పీఓ వరుణ్ రెడ్డి.

  భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలకు ఎస్.బి.ఐ శాఖ చేయూత నందించడం అభినందనీయమని ఐటిడిఏ పీఓ వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం ఉట్నూరు తహసీల్దార్ కార్యాలయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ ప్రాంతీయ కార్యాలయం, ఉట్నూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వర్షాల వలన నిరాశ్రుయులైన బాధితులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ గత జూలై నెలలో కురిసిన భారీ వర్షాల వలన నష్టపోయిన కుటుంబాలకు ఎస్.బి.ఐ…