Day: August 29, 2022

పత్రికా ప్రకటన.   తేది:29.08.2022, వనపర్తి. స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి సమావేశమందిరంలో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో (54) గ్రామాలను ఎంపిక చేసి, పారిశుద్ధ్య పనులను చేపట్టినట్లు ఆమె సూచించారు. త్వరలో కేంద్ర బృందం…

పత్రికా ప్రకటన   తేది:29.08.2022, వనపర్తి. అన్ని రంగాలలో కన్నా వ్యవసాయం ఎంతో ప్రాధాన్యత కలిగిన వృత్తి అని, సేద్యాన్ని బృహత్ కార్యంగా భావించి ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. సోమవారం పాన్గల్ మండలంలోని రాయినిపల్లి, అన్నారం గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నదని, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పొంది లాభసాటి సేద్యాన్ని సాగు చేయాలని ఆయన తెలిపారు.…

పత్రికా ప్రకటన.    తేది:29.08.2022, వనపర్తి. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి. ప్రజావాణి సమావేశ మందిరంలో ఆమె ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి ఫిర్యాదుదారుల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా దరఖాస్తుదారుల నుండి (18) ఫిర్యాదులను…

శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలి – అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్

శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలి – అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్   జిల్లాలో శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గణేష్ చతుర్థి పండుగ ముందస్తు ఏర్పట్లపై అధికారులు, శాంతి కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వినాయక మండపాలు ఏర్పాటు చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో పండుగలు జరుపుకోవాలని సూచించారు.…

నేటి తరం క్రీడాకారులకు మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తిదాయకం – అదనపు కలెక్టర్ పద్మజ రాణి

నేటి తరం క్రీడాకారులకు మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తిదాయకం – అదనపు కలెక్టర్ పద్మజ రాణి నేటితరం క్రీడాకారులకు మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తిదాయకం అని అదనపు జిల్లా కలెక్టర్ పద్మజారాణి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మినీ స్టేడియం క్రీడా ప్రాంగణంలో సోమవారం ఓపెన్ టు అల్ కబడ్డీ టోర్నమెంట్ ను జిల్లా క్రీడలు మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ  క్రీడారంగంలో మన…

విజయ డైరీ రైతులకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయకచవితికి ముందే శుభవార్త చెప్పారు. విజయ డెయిరీ ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు సోమవారం రాజేంద్ర నగర్ లోని కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించే క్రమంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులు, పాడి రైతులతో నిర్వహించిన  అవగాహన సదస్సు లో…

ప్రచురణార్ధం ఆగష్టు 29 ఖమ్మం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. ఖమ్మం నియోజకవర్గంకు కొత్తగా మంజూరైన పింఛన్ ధ్రువపత్రాలను సోమవారం రఘునాథపాలెం మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్దిదారులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. 57 సంవత్సరాలు పూర్తి అయిన వృద్ధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్త పంపిణీలో…

నులిపురుగుల నిర్మూలన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

  నులిపురుగుల నిర్మూలన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలి ఆశా, ఎఎన్ఎం ల ద్వారా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణి జరిగేలా చూడాలి 1 నుండి 19 సవంత్సరాల లోపు పిల్లలకు100శాతం మాత్రలు అందాలి. బడి బయటి పిల్లల కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి కార్యక్రమపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రజాప్రతినిధులను కార్యక్రమంలో బాగస్వాములను చేయాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 0 0 0 0               1 నుండి 19 సంవత్సరాలలోపు…

వికారాబాద్ జిల్లా పరిగిలోని సాంఘిక సంక్షేమ బాలుర  మరియు గిరిజన సంక్షేమ     బాలికల గురుకులాలను సాంఘిక , గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి శ్రీ రోనాల్డ్ రోస్  నేడు సందర్శించారు, పాఠశాలల్లోని ప్రతి విభాగాన్ని పరిశీలించారు. తరగతి గదులను,        డార్మిటరీ లను తనిఖీ చేసిన తర్వాత, విద్యార్థులతో మరియు సిబ్బంది తో మాట్లాడారు. వంట  గదులను పరిశీలించిన తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. పిల్లలకు నాణ్యమైన       ఆహారం అందించాలని , అంటువ్యాదులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని…

తెలంగాణలోని అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్ షిప్స్ అందాలని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.మారు మూల, పేద విద్యార్థుల కోసం టి-సాట్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్ షిప్స్ పై సోమవారం టి-సాట్ నిర్వహించిన ప్రత్యేక లైవ్ కార్యక్రమంలో సైట్ ప్రొఫెసర్ డాక్టర్ రవికాంత్, ఎస్.సి.ఇ.ఆర్.టి., ఎస్.ఆర్.జి సభ్యులు పి.సురేష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. గత సంవత్సరం 2,921 మంది విద్యార్థులకు అర్హత ఉండగా 2,421 మంది మాత్రమే ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్ షిప్…