Month: August 2022

ప్రచురణార్థం ఖమ్మం, ఆగస్టు 30: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్. వర్మ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి అధికారులతో పథకాల అమలు ప్రగతిపై కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టి, వారు…

ITDA UTNR: కళ్యాణ లక్ష్మి తో పేదల కుటుంబాల్లో వెలుగులు: ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యామ్ నాయక్.

    ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన నిరుపేదలకు అందేలా కృషి చేస్తున్నామని ఖానాపూర్ శాసనసభ్యురాలు రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. మంగళవారం ఉట్నూర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం నిరుపేద దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ, మైనార్టీ కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 36…

పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం :- శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి

పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం :- శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి రాష్ట ప్రభుత్వం భారత దేశంలోనే  ఎక్కడ లేని విధంగా  సంక్షేమమే ధ్యేయం గా పనిచేస్తుందని ఎస్. రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం జిల్లాకు మంజూరు ఆయిన కొత్త ఆసరా పింఛన్ల  పంపిణి కార్యక్రమం లో స్థానిక శాసన సభ్యులు యస్ రాజన్ధర్ రెడ్డి పేర్కొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  జిల్లా కేంద్రం లోని సుభాష్ రోడ్ అవడుతమటం,…

DPRO ADB- పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను వినియోగించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను వినియోగించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున స్థానిక బిసి స్టడీ సర్కిల్ లో మట్టి వినాయకుల పంపిణి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ సందర్బంగా జిల్లాలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వినాయక పూజ కార్యక్రమాలను ఇప్పటి నుండే మట్టితో తయారు చేసిన వినాయకులను వాడాలని అన్నారు. కోవిడ్ కారణంగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా…

DPRO ADB-  ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున రిమ్స్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమ్స్ లోని చిన్న పిల్లల వార్డు, గైనకాలజి విభాగం లలో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. గత వారంలో రిమ్స్ ఆసుపత్రిని పరిశీలించామని, వైరల్ ఫీవర్ కారణంగా మరిన్ని వార్డులను ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు వైద్య…

అన్ని ఆన్ గోయింగ్ పనులు దసరాలోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టి పురోగతి లో ఉన్న అన్ని ఆన్ గోయింగ్ వర్క్ లు దసరా లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపడుతున్న అంగన్వాడీలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, డే కేర్…

ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేష్ ప్రతిమలనే ప్రతిష్టించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* —————————————- వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఇంట్లో మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సిరిసిల్ల కుమ్మరి సంఘం వారు తయారుచేసిన మట్టి వినాయక విగ్రహాలను అధికారులు, సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో…

పత్రికా ప్రకటన.   తేది:29.08.2022, వనపర్తి. స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి సమావేశమందిరంలో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో (54) గ్రామాలను ఎంపిక చేసి, పారిశుద్ధ్య పనులను చేపట్టినట్లు ఆమె సూచించారు. త్వరలో కేంద్ర బృందం…

పత్రికా ప్రకటన   తేది:29.08.2022, వనపర్తి. అన్ని రంగాలలో కన్నా వ్యవసాయం ఎంతో ప్రాధాన్యత కలిగిన వృత్తి అని, సేద్యాన్ని బృహత్ కార్యంగా భావించి ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. సోమవారం పాన్గల్ మండలంలోని రాయినిపల్లి, అన్నారం గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నదని, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పొంది లాభసాటి సేద్యాన్ని సాగు చేయాలని ఆయన తెలిపారు.…

పత్రికా ప్రకటన.    తేది:29.08.2022, వనపర్తి. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి. ప్రజావాణి సమావేశ మందిరంలో ఆమె ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి ఫిర్యాదుదారుల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా దరఖాస్తుదారుల నుండి (18) ఫిర్యాదులను…