Day: September 5, 2022

దేశ భవిష్యత్తును నిర్ణయించే పౌరులను తయారు చేసే వారే ఉపాద్యాయులు:: రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

ప్రచురణార్థం: మహబూబాబాద్, సెప్టెంబర్ 05: దేశ భవిష్యత్తును నిర్ణయించే పౌరులను తయారు చేసే వారే ఉపాద్యాయులని గౌరవమైన ఉన్నతమైన స్థానం కేవలం ఉపాద్యాయులకే ఉంటుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఐఎంఏ హాలులో జరిగిన గురు పూజోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఉత్తమ ఉపాద్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురుతరమైన భాద్యతతో సమాజాన్ని ముందుకు…

స్వచ్చ గురుకులం కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపట్టి ప్రత్యేక మార్పు తేవాలి::రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

ప్రచురణార్ధం మహబూబాబాద్, సెప్టెంబర్ 05: రాష్ట్రంలో గత ఏడేళ్ళలో గురుకుల విద్య అభివృద్ధికి కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని దీనిలో భాగంగా గురుకులాల సంఖ్యను 183 కు పెంచుకున్నామని 22 డిగ్రీ కాలేజీలు 332 ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “స్వచ్చ గురుకులం” కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, సాంఘీక సంక్షేమ…

పత్రికా ప్రకటన    తేది:05.09.2022, వనపర్తి. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సిర్కిల్ హైదరాబాద్ ద్వారా నిర్వహిస్తున్న సి.సాట్-2023 (CSAT-2023)  భోజన, వసతులతో కూడిన ఉచిత శిక్షణ కొరకు అర్హత కలిగిన ఎస్సీ, ఎస్సీ, బిసి, మైనారిటీ  అభ్యర్థుల నుండి ఆగస్టు 24 నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, చివరి తేది:07.09.2022 అర్ధరాత్రి 12.00 గం॥ ల వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని నుషిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ…

పత్రికా ప్రకటన తేది:05.09.2022, వనపర్తి. తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువులు పునర్జన్మనిస్తారని జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అన్నారు. సోమవారం “ఉపాధ్యాయ దినోత్సవం” సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని (37) మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువా, పూలమాలలు, మొమెంటులతో జడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్ లు ఘనంగా సత్కరించారు. ఈ…

పత్రికా ప్రకటన     తేది:05.09.2022, వనపర్తి. ఈ నెల 15వ తేదీన “జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం” నిర్వహించనున్నట్లు, 1-19 సం.ల చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలు అందించేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు. సోమవారం ఐ డి ఓ సి ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో “జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం” పై జిల్లా అధికారులతో ఆమె జిల్లా సమన్వయ కమిటీ సమావేశం…

ప్రచురణార్థం సిఎంఆర్ రైస్ ని త్వరితగతిన అందించాలి… జనగామ సెప్టెంబర్ 5. 2021- 22 వానాకాలంకు సంబంధించిన సిఎంఆర్ రైసు 70% పూర్తి చేయడం జరిగిందని మిగతా 30% త్వరితగతిన అందించాలన్నారు. అదేవిధంగా 2021- 22 యాసంగికి సంబంధించిన సిఎంఆర్ రైసును అందించేందుకు నిర్దేశించిన విధంగా నిర్ణీత సమయంలో అందించాలని కలెక్టర్ మిల్లర్ లను ఆదేశించారు. అధికారులు కూడా పర్యవేక్షిస్తూ సమన్వయంతో లక్ష్యాలను అధిగమించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ జిల్లా పౌరసరఫరాల…

పత్రికా ప్రకటన     తేది:05.09.2022, వనపర్తి. గురుకుల వసతి గృహాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి. ప్రజావాణి సమావేశ మందిరంలో “స్వచ్చ గురుకుల” పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 6వ. తేది నుండి 12వ. తేది వరకు జిల్లాలో ఉన్న ఆరు ఎస్సీ గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని…

పత్రికా ప్రకటన.    తేది:05.09.2022, వనపర్తి. ప్రజావాణి కార్యక్రమం ద్వారా దరఖాస్తుదారుల నుండి అందిన ఫిర్యాదులను జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి. ప్రజావాణి సమావేశ మందిరంలో ఆమె ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి దరఖాస్తుదారుల ద్వారా అందిన ఫిర్యాదులను పరిశీలించి జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆమె సూచించారు.…

ప్రచురణార్థం విద్యలో జిల్లాను నెంబర్ వన్ స్థాయిలో నిలపాలి… జనగామ సెప్టెంబర్ 5. విద్యలో జనగామ రాష్ట్రంలో 10వ స్థానంలో ఉందని నెంబర్ వన్ స్థానంలో నిలపాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. సోమవారం సూర్యాపేట రోడ్డు లోని ఎన్ ఎం ఆర్ గార్డెన్లో సెప్టెంబర్ 5 స్వర్గీయ మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో…

పిల్లల మనసులు గెలవండి ప్రపంచం పోకడను పరిచయం చేయండి.  కలెక్టర్ హరిచందన

పిల్లల మనసులు గెలవండి ప్రపంచం పోకడను పరిచయం చేయండి.  కలెక్టర్ హరిచందన   జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిచందన గారు మాట్లాడుతూ, పిల్లలకు ఎల్లకాలం నిలబడేలా వారి మనసులో గెలుచుకునే విధంగా బోధన చేస్తూ వారికి ప్రస్తుత ప్రపంచాన్ని పరిచయం చేయాలని వారిలో ఆసక్తిని నేర్చుకునే జిజ్ఞాసను పెంపొందించాలని కోరారు.   జిల్లాలో ఇప్పటికే చాలామంది ఉపాధ్యాయులు తమ సర్వస్వాన్ని ధారం…