Day: September 6, 2022

పత్రికా ప్రకటన    తేది:06.09.2022, వనపర్తి. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం “పోషణ మాసం” నిర్వహిస్తున్నదని జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన తో కలిసి ఆయన పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ 1వ. తేది నుండి 30వ. తేది వరకు…

ప్రచురణార్థం ఖమ్మం, సెప్టెంబర్ 6: విజయ డైరీ ద్వారా రైతుల నుండి పాల సేకరణ ధర పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. విజయ డైరీ పాల సేకరణ ధర పెంపుపై రూపొందించిన కరపత్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షత్రస్థాయిలో ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో పాడి రైతుల విజ్ఞప్తి మేరకు గేదె పాలు లీటరు…

ప్రచురణార్థం బ్యాంక్ వివాదాలు ప‌రిష్క‌రించుకునేందు చ‌క్క‌ని అవ‌కాశం ఈ నెల 17న బ్యాంక‌ర్స్ తో మెగా లోక్ అదాల‌త్‌ – జిల్లా జ‌డ్జి డా. టి. శ్రీనివాస‌రావు ఖమ్మం, సెప్టెంబర్ 6: బ్యాంక్ లావాదేవీల‌కు సంబందించిన వివాదాలు ప‌రిష్క‌రించేందుకు ఈ నెల 17న మెగా లోక్ అదాల‌త్ నిర్వ‌హిస్తున్న‌ట్టు జిల్లా జ‌డ్జి డా. టి. శ్రీనివాస‌రావు తెలిపారు. మంగ‌ళ‌వారం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ, మెగా లోక్ అదాల‌త్‌లో వివిధ రకాల…

ప్రచురణార్థం ఖమ్మం, సెప్టెంబర్ 6: దళితబంధు పధకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ మంగళవారం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో పర్యటించి, గ్రామంలో మంజూరైన దళితబంధు యూనిట్లను పరిశీలించి, లబ్దిదారులతో అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హార్వెస్టర్, జేసిబి, డెయిరీ, గొర్రెలు, డీజె, సెంట్రింగ్, ఫోటో వీడియో యూనిట్లను పరిశీలించి, లబ్దిదారులతో ఎంత ఆదాయం సమకూరుతున్నదో వివరాలు అడిగి తెలుసుకున్నారు. హార్వెస్టర్, జేసిబి లబ్దిదారులు ఆదాయం కొరకు…

ప్రచురణార్థం ఖమ్మం, సెప్టెంబర్ 6: బోనకల్ ఆర్వోబి సుందరీకరణ పనులను జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆర్వోబి సుందరీకరణలో భాగంగా పూర్తి చేసిన గ్రీనరీ, బస్ షెల్టర్, పిల్లల పార్క్, పార్కింగ్ ఏర్పాట్లను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బస్ షెల్టర్ ఏర్పాటుకు పూర్వం రోడ్డుపై బస్సులు ఆపేవారని, ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఎంతో ఉండేవని…

DPRO ADB-అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోండి – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు మీ పేరును ఓటరుగా నమోదు చేసుకోండి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరఫరా చేసిన ఓటర్ నమోదు, ఆధార్ అనుసంధానం కు సంబందించిన పోస్టర్ లను కలెక్టర్ ఆవిష్కరించారు. కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే వారు నిర్ణిత ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఆధార్ నంబర్ ను అనుసంధానం…

ప్రచురణార్థం ఈవీఎం గోదాము ను తనిఖీ చేసిన కలెక్టర్… జనగామ సెప్టెంబర్,06. ఈవీఎం గోదాము భద్రతలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం త్రైమాస తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదామును అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి తనిఖీ చేశారు. ముందుగా కలెక్టర్ తాళం వేసి ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. సిబ్బందితో తాళం తెరిపించి ఈ.వి.ఎం.లను పరిశీలించారు. అనంతరం రిజిస్టర్ లో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా…

ITDA UTNR: విద్యార్థులకు మెరుగైన విద్యనందించండి. ఐటిడిఎ పిఓ కె.వరుణ్ రెడ్డి.

  విద్యార్థులకు మెరుగైన విద్యనందించండి. ఐటిడిఎ పిఓ కె.వరుణ్ రెడ్డి. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటిడిఎ పిఓ వరుణ్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్, రేకులగూడ గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. విద్యార్థుల హాజరు శాతం, విద్యా, వైద్యం తదితర అంశాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గణితం,…

DPRO ADB-క్రీడా పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం కావాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాణించి పాఠశాలను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇటీవల రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడా పాఠశాల విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడాకారులకు ప్రభుత్వం విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. సమాజంలో గుర్తింపు, డబ్బు గడిస్తున్న క్రీడాకారులెందరో ఉన్నారని అన్నారు. రాబోవు రెండేళ్లలో మరిన్ని పతకాలు సాధించేలా…

  జలశక్తి పథకాలు బాగున్నాయి – జిల్లా అధికారులకు జలశక్తి అభియాన్ బృంద సభ్యుల కితాబు —————————— —————————— జిల్లాలో జలశక్తి అభియాన్‌ ద్వారా చేపట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని జలశక్తి అభియాన్ బృంద సభ్యులు నరేంద్ర కుమార్, ప్రభాత్ చౌహాన్ ప్రశంసించారు. జలశక్తి అభియాన్ బృంద సభ్యులు మొదటి రోజు క్షేత్ర పరిశీలన అనంతరం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, సంబంధిత ప్రభుత్వ అధికారులతో మంగళవారం సాయంత్రం సమావేశం అయ్యారు.…